E-Paper
Advertisement

మెట్రో పిల్లర్లను తవ్వేస్తున్న అగంతకులు.. ఇటు చూడండి సారు!

మెట్రో పిల్లర్లను తవ్వేస్తున్న అగంతకులు.. ఇటు చూడండి సారు!
Advertisement

Metro Pillar: మెట్రో మహాకుట్రకు మూలం దొరికింది ఈ గుంతల్లోనే. ఈ గోతులు ఎక్కడో లేవు. సాక్షాత్తూ మెట్రో పిల్లర్ చుట్టూ తవ్వుతున్న గుంతలు ఇవి. సికింద్రాబాద్‌లో ఇస్కాన్ టెంపుల్ దగ్గరున్న మెట్రో పిల్లర్ల చుట్టూ ఇలా గుంతలు తవ్వేశారు. c-1192, c-1193 పిల్లర్ల దగ్గరే ఇదంతా జరుగుతోంది.

మెట్రో పిల్లర్ల చుట్టూ గోతులు..

Advertisement

పక్కపక్కనే ఉన్న పిల్లర్ల దగ్గరే ఇంత దారుణంగా గుంతలు తవ్వారు.ఏమాత్రం తేడా వచ్చినా ఈ పిల్లర్లు కూలిపోతాయి. అంటే ఎప్పుడు ఏ రైలు కూలుతుందో తెలియని దారుణ పరిస్థితిలో ఉన్నాం. రోజూ లక్షల మంది ప్రయాణించే మెట్రో రైలు భద్రతనే ఇప్పుడు ప్రశ్నార్ధకం చేస్తున్నారు. మెట్రో పిల్లర్ నుంచి చిన్న పెచ్చు ఊడితేనే సెన్షేషన్ అవుతున్న పరిస్థితి. అలాంటిది ఇంత నిర్లక్ష్యంగా పిల్లర్ల చుట్టూ గోతులు తవ్వినా ఎవరికీ ఎందుకు పట్టడం లేదు?

పిల్లర్ చుట్టూ 4.8 మీటర్లు నో టచ్..

Advertisement

ఇక్కడేదో కమర్షియల్ నిర్మాణానికే ఈ గుంతలు తవ్వారనేది స్పష్టంగా కనిపిస్తోంది. మెట్రో పిల్లర్ చుట్టూ 4.8 మీటర్ల పరిధిలో ఏ మాత్రం టచ్ చేయకూడదు. ఈ విషయాన్ని MPM మాల్ నిర్మాణం సమయంలో ఇచ్చిన గైడ్‌లైన్స్ స్పష్టంగా చెప్తున్నాయి.

Also Read: సూడాన్‌లో విషాదం.. కూలిన బంగారు గని.. 67 మంది దుర్మరణం!

మెట్రో భద్రతపై తీవ్ర ఆందోళన

మెట్రో పిల్లర్ చుట్టూ 4.8 మీటర్ల పరిధి వరకు ఎలాంటి చర్యలు ఉండకూడదనేది నిబంధన. కానీ ఇక్కడ పిల్లర్ కిందే తవ్వేశారు. లోయర్ లెవల్ పిల్లర్ కూడా స్పష్టంగా బయటకు కనిపిస్తోంది. అది కూడా ఒకటి కాదు… రెండు పిల్లర్లను కింది వరకూ తవ్వేశారు. ఏమాత్రం తేడావచ్చినా ఇవి కూలిపోతుంది. అదే జరిగితే… ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఊహించుకోవడానికే వణుకు పుడుతోంది. ఎన్ని ప్రాణాలు గాల్లో కలుస్తాయన్నది తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది.

Tags

Related News

మిస్టేక్ ఎవరిదీ.. 22 ఏలో సర్కార్ బ్లేమ్ వెనక కుట్ర ఉందా..?

మెట్రో పార్కింగ్.. గోల్ మాల్? రూ.వేల కోట్లలో స్కామ్?

సీఎం వస్తేనే అసెంబ్లీకి వస్తారా.. అధికార మంత్రుల తీరుపై సొంత నేతలు ఫైర్!

కోట్లలో ముంచారు.. మళ్లీ అదే బాధితులకు వల! 400 డాలర్ల పేరుతో సైబర్ కేటుగాళ్ల కొత్త మోసం

కేసీఆర్‌కు సొంత ఇల్లు కూడా లేదు..కానీ ఆయన వందల ఎకరాలున్న కుటుంబంలో పుట్టారు!

కేసీఆర్ కుటుంబానికి బిగుసుకున్న ఉచ్చు.. భూ అక్రమాలపై సిట్ విచారణకు ప్రభుత్వం సిద్ధం!

పశ్చిమాసియాలో హైటెన్షన్.. యుద్ధానికి అమెరికా గ్రీన్ సిగ్నల్!

Big Stories

Advertisement
×