E-Paper
Advertisement

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,
Advertisement

Indonesia: ఇండోనేషియాలో ఆదివారం 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక అదృశ్యమైంది. జావా సముద్రంలో ఆ నౌకతో సంబంధాలు తెగిపోయాయి. ప్రాథమిక సమాచారం మేరకు ఆ నౌక చివరిసారి జావా సముద్రంలోని బంజర్‌మాసిన్ రేవుకు సుమారు 148 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిసింది. సహాయక బృందాలు ఆ ప్రాంతంలో ఓడ కోసం గాలిస్తున్నాయి. అసలు ఎలా జరిగింది?

ఇండోనేషియా నుంచి 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు

ఇండోనేషియాలోని తూర్పు జావా నుండి దక్షిణ కాలిమంతన్ ప్రావిన్స్‌కు వెళ్తున్న 240 మందికి పైగా ప్రయాణికులతో కూడిన ఓ నౌక జావా సముద్రంలో ఉండగా దాంతో సంబంధాలు తెగిపోయాయి. దీని గురించి తెలియగానే ఇండోనేషియా మెరైన్ సహాయక బృందాలు ఆదివారం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ విషయాన్ని అక్కడి అధికారులు తెలిపారు.

Advertisement

బోర్నియో ద్వీపంలో దక్షిణ కాలిమంటన్‌లోని బంజర్‌మాసిన్ నగరానికి వెళ్తోంది. ఆదివారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో ‘వర్గో ట్రాన్స్‌పోర్ట్ 8’ నౌకతో సంబంధాలు తెగిపోయాయి. ఆ నౌక బంజర్‌మాసిన్‌కు వెళ్లే మార్గంలో తూర్పు జావా ప్రావిన్స్‌లోని ఇండోనేషియా రెండో అతిపెద్ద నగరం సురబయ నుండి బయలుదేరింది.

జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన

నౌక ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొందని సమాచారం అందిన తర్వాత నౌకా నిర్వాహకుడు ఈ సంఘటన గురించి అధికారులకు వివరించారు. ప్రయాణ సమయంలో ఆ నౌకలో సమాచార లోపం తలెత్తడంతో దాన్ని సంప్రదించలేకపోయామని అధికారులు తెలిపారు.

Advertisement

ప్రాథమిక సమాచారం మేరకు ఆ నౌక చివరిసారిగా జావా సముద్రంలోని బంజర్‌మాసిన్ రేవుకు సుమారు 148 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిసింది. సహాయక బృందాలు ఆ ప్రాంతంలో ఓడ కోసం గాలిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు 103 మందిని రక్షించారని, 140 మంది ఇంకా గల్లంతయ్యారని తెలుస్తోంది. ఒకరు మరణించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

సుమారు 17,000 ద్వీపాలతో కూడిన ద్వీప సమూహం ఇండోనేషియా. ఆయా ద్వీపాల మధ్య ప్రయాణించడానికి ఫెర్రీలపై ఎక్కువగా ఆధారపడతారు ప్రజలు. విమాన ప్రయాణంతో పోలిస్తే సముద్ర మార్గాలు మరింత చవకైనవి, అందుబాటులో ఉంటాయి. అయితే భద్రతా ప్రమాణాలను ఎల్లప్పుడూ కఠినంగా అమలు చేయకపోవడం వల్ల ప్రమాదాల రేటు అధికంగా ఉంటుంది. ఈ దేశం ఉష్ణమండల ప్రాంతంలో ఉండటం వల్ల భారీ వర్షాలు, తుఫానులు, ఉధృతమైన సముద్ర అలలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాతావరణం చిన్న, మధ్య తరహా నౌకలకు ప్రయాణాన్ని కష్టతరం అవుతుంది.

ALSO READ: బ్రిక్స్ సదస్సులో చారిత్రక ఘట్టం.. ఢిల్లీ డిక్లరేషన్‌ కు ఏకగ్రీవ ఆమోదం!

గతంలో ఇండోనేషియాలో పెద్ద ఓడ ప్రమాదాలు జరిగాయి. 1981లో టాంపోమాస్-2 అనే నౌక జావా సముద్రంలో మునిగిపోయింది. సుమారు 430 మంది జల సమాధి అయ్యారు. 2006లో ప్రతికూల వాతావరణం కారణంగా జావా సముద్రంలో సెనోపతి నుసంతర అనే నౌక మునిగి పోయింది. ఈ ప్రమాదంలో 400 మందికి పైగా మరణించారు లేదా గల్లంతయ్యారు. 2007లో లెవినా-1 ఫెర్రీ అగ్నిప్రమాదం తర్వాత మునిగిపోవడంతో 50 మందికి పైగా మరణించారు. 2018లో దక్షిణ సులవేసి తీరంలో లెస్టారి మజు ఫెర్రీ మునిగిపోవడంతో 36 మంది మరణించిన విషయం తెల్సిందే.

 

Tags

Related News

బ్రిక్స్ సదస్సులో చారిత్రక ఘట్టం.. ఢిల్లీ డిక్లరేషన్‌ కు ఏకగ్రీవ ఆమోదం!

భారత్‌కు అమెరికా బిగ్ షాక్? రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లపై 100% టారిఫ్!

9/11 దాడులకు 25 ఏళ్లు.. బిన్ లాడెన్ కొడుకు రీ ఎంట్రీ.. అల్ ఖైదా కొత్త వీడియో కలకలం!

బంగ్లాదేశ్‌లో హిందూ సాధువు తీవ్ర భావోద్వేగం.. దేవుడి పాదాలు తాకి కన్నీటి పర్యంతం!

పుతిన్ ‘అంతర్గత’ భద్రత.. ఆయన టిష్యూల నుండి టవల్స్ వరకు, మలం కూడా మళ్లీ రష్యాకే

H-1B వీసాదారులకు ట్రంప్ ఝలక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ ఎత్తేసే ఛాన్స్, అందుకోసం కొత్తగా

తగలబడిన పెర్రీ.. ఐదుగురు మృతి, 80 మంది మిస్సింగ్, ఫిలిప్పిన్స్‌‌లో ఘోరం

Big Stories

Advertisement
×