Mahindra XEV 9S Sales: దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా మరో అరుదైన గుర్తింపు పొందింది. ఈ కంపెనీకి చెందిన XEV 9S ఎలక్ట్రిక్ SUV, FY27 ఫస్ట్ క్వార్టర్ లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న MG విండ్సర్ EVని వెనక్కి నెట్టి మహీంద్రా ఈ ఘనత సాధించింది. మహీంద్రా.. XEV 9Sని అత్యాధునిక టెక్నాలజీ, ఆకట్టుకునే డిజైన్, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ తో మార్కెట్లోకి తీసుకొచ్చింది. వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించడంతో అమ్మకాల పరంగా ఇది టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లింది.
ఈ ఎలక్ట్రిక్ SUVలో మూడు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 59 kWh, 70 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. 59 kWh బ్యాటరీతో వచ్చే మోడల్ 227 bhp పవర్, 380 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 70 kWh వెర్షన్‌లో 241 bhp పవర్ లభిస్తే, 79 kWh టాప్ వేరియంట్ లో 281 bhp పవర్ అందుతుంది. మూడు వేరియంట్లలో కూడా గరిష్టంగా 380 Nm టార్క్ లభిస్తుంది. XEV 9Sను మహీంద్రా మొత్తం ఆరు వేరియంట్లలో అందిస్తోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లు, ఫీచర్లతో ఈ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
ఫీచర్ల విషయానికి వస్తే, ఈ SUVలో టెక్నాలజీకి పెద్దపీట వేశారు. MAIA AI అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సిస్టమ్ ను ఇందులో అమర్చారు. ఇది పలు ఫీచర్లను మరింత స్మార్ట్ గా పనిచేసేలా చేస్తుంది. డ్యాష్ బోర్డ్ పై మూడు స్క్రీన్లతో కూడిన డిజిటల్ డిస్ ప్లే, వెనుక ప్రయాణికుల కోసం ప్రత్యేక ఎంటర్ టైన్‌మెంట్ స్క్రీన్లు, 16 స్పీకర్ల సౌండ్ సిస్టమ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్ అప్ డిస్ ప్లే లాంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే 65W ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, యాంబియంట్ లైటింగ్, పానోరమిక్ స్కై రూఫ్, అత్యాధునిక ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా అందుబాటులో ఉన్నాయి.
భద్రత విషయంలో కూడా మహీంద్రా ఎలాంటి రాజీ పడలేదు. ఈ SUVలో 7 ఎయిర్ బ్యాగ్‌లు స్టాండర్డ్ గా లభిస్తాయి. అలాగే లెవెల్ 2+ ADAS ను కూడా అందించారు. ఇందులో రాడార్లు, కెమెరాల సహాయంతో పలు భద్రతా ఫీచర్లు పనిచేస్తాయి. డ్రైవర్ నిద్రను గుర్తించే ఫీచర్ కూడా ఇందులో ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో మహీంద్రా XEV 9S టాప్ ప్లేస్ లో నిలవడం పట్ల కంపెనీ సంతోషం వ్యక్తం చేసింది. శక్తివంతమైన పనితీరు, ఆధునిక ఫీచర్లు, అధిక భద్రతా సదుపాయాలతో ఈ ఎలక్ట్రిక్ SUV వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అందుకే FY27 ఫస్ట్ క్వార్టర్ లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా XEV 9S నిలిచింది.
Read Also: 2030 నాటికి కియా నుంచి 8 ఎలక్ట్రిఫైడ్ కార్లు.. EV, హైబ్రిడ్, CNGపై భారీ ప్లాన్!