E-Paper
Advertisement

పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ డోస్.. ఒక్క ఫొటోతో సోషల్ మీడియా షేక్!

పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ డోస్.. ఒక్క ఫొటోతో సోషల్ మీడియా షేక్!
Advertisement

Payal Rajput:పాయల్ రాజ్‌పుత్..RX 100అంటూ మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు దించిన ఈ పంజాబీ బ్యూటీ ఇపుడు సినిమాలు తగ్గించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం మాంచి జోరు చూపిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

స్టైలిష్ అండ్ క్లాసీ లుక్

Advertisement

ఈ పోస్ట్ లో “Style and elegance” అనే క్యాప్షన్‌తో పాయల్ షేర్ చేసిన ఈ పిక్ అందరిని ఫిదా చేస్తుంది. ఇందులో పాయల్ రాయల్ అండ్ ఫ్యాషనబుల్ వేర్‌లో మెరిసిపోయిందనే చెప్పాలి. గోల్డ్ కలర్ కార్సెట్ డిజైన్ టాప్‌కి లైట్ బ్లూ స్కర్ట్‌ను మ్యాచ్ చేసిన తీరుకి ఫిదా అవుతున్నారు ఫ్యాషన్ లవర్స్. దీనికి తోడు మెడలో వేసుకున్న హ్యావీ నెక్లెస్, చేతికి ఉన్న బ్యాంగిల్స్ ఆమె లుక్‌కి మరింత రిచ్‌నెస్ తెచ్చిపెట్టాయనడంలో ఆశ్చర్యమే లేదు.ఇక హెయిర్ స్టైల్ చాలా సింపుల్‌గా వెనక్కి దువ్వి, హెవీ మేకప్ లేకుండా చాలా నేచురల్‌గా కెమెరా వైపు చూస్తున్న తీరు అందరిని మెస్మరైజ్ చేస్తుంది.

‘RX 100’తో ఒకేసారి పీక్స్‌కి..

Advertisement

పాయల్ రాజ్‌పుత్ కెరీర్ విషయానికి వస్తే అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ సరసన నటించిన ‘RX 100’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డం సొంతం చేసుకుంది. అందులో పాయల్ చేసిన ‘ఇందు’ క్యారెక్టర్ టాలీవుడ్‌లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌ను అంత బోల్డ్‌గా చేసి మెప్పించడం అంత ఈజీ కాదు కూడా.

ఇక ‘RX 100’ సక్సెస్ తర్వాత పాయల్‌కు ఆఫర్లు క్యూ కట్టాయి కూడా .అలా ‘RDX Love’లో అలరించిన ఈ బ్యూటీ విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కాంబోలో వచ్చిన ‘వెంకీ మామ’లోనూ, మాస్ మహారాజా రవితేజ నటించిన ‘డిస్కో రాజా’సినిమాలో మంచి పాత్రలనే దక్కించుకుంది.

అయితే కెరీర్ డ్రాప్ అవుతున్న సమయంలో RX 100’ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మంగళవారం’తో మరోసారి తన సత్తాని ప్రూవ్ చేసుకుంది. మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాలో పాయల్ ‘శైలూ’ అనే ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేసింది. సిగ్లామర్ ఇమేజ్‌ను పక్కన పెట్టి, పెర్ఫార్మెన్స్ సెంట్రిక్ రోల్‌లో పాయల్ జీవించేసిందనే చెప్పాలి.

సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్

అయితే సినిమాల స్పీడ్ కాస్త తగ్గినా.. సోషల్ మీడియాలో మాత్రం పాయల్ ఫుల్ యాక్టివ్ గా ఉండటం విశేషం.క్రమం తప్పకుండా చేసే ఫొటోషూట్లు, ట్రావెల్ పిక్స్, ఫ్యాషన్ డ్రెస్సింగ్ లుక్స్‌తో ఎప్పుడూ అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది.

ALSO READ:సంగీత సామ్రాజ్ఞి కథలో నేషనల్ క్రష్.. రష్మిక కొత్త అవతారం!

మొత్తానికి ‘RX 100’లో ఇందుగా షాక్ ఇచ్చి, ‘మంగళవారం’లో శైలూగా ఏడిపించి మెప్పించిన ఈ భామ, ఇప్పుడు ఇలాంటి హాట్ అండ్ క్లాసీ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్‌కి నెటిజన్ల నుంచి లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తోంది.

Tags

Related News

సంగీత సామ్రాజ్ఞి కథలో నేషనల్ క్రష్.. రష్మిక కొత్త అవతారం!

జాన్వీ, ఖుషీలకు నోటీసులు.. శ్రీదేవి ఆస్తి వివాదంలో సుప్రీం కీలక ఆదేశం

సెన్సార్ బోర్డు పునర్వ్యవస్థీకరణ.. CBFCలో చోటు దక్కించుకున్న సుప్రియ యార్లగడ్డ

‘కాంతారా’ బ్యూటీకి అవార్డు.. రుక్మిణీ వసంత్ స్పెషల్ పోస్ట్ వైరల్!

ఎల్లమ్మలో దేవిశ్రీకి జోడీ ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ ఫిక్స్ అయినట్టే!

దేవికా రాణి నుంచి మోహన్‌లాల్ వరకు.. దాదాసాహెబ్ ఫాల్కే లిస్ట్ ఇదే!

బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. వద్దు బాబోయ్ అంటున్న మెగా ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×