E-Paper
Advertisement

సంగీత సామ్రాజ్ఞి కథలో నేషనల్ క్రష్.. రష్మిక కొత్త అవతారం!

సంగీత సామ్రాజ్ఞి కథలో నేషనల్ క్రష్.. రష్మిక  కొత్త అవతారం!
Advertisement

MS Subbulakshmi Biopic:బయో పిక్ లకి ఎంత డిమాండ్ ఉంటుందో అంతకు మించిన విమర్శలు కూడా రెడీ గా ఉంటాయి.సినిమా ఏ మాత్రం అటూ ఇటూ అయినా చెడుగుడు ఆడేస్తుంటారు నెటిజన్లు.అయినప్పటికీ రిస్క్ చేస్తూ ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ బయోపిక్ లని తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టారు. ఇపుడు అదే బాటలో మేమూ అంటూ సరికొత్త కథకి శ్రీకారం చుట్టారు మన టాలీవుడ్ మేకర్స్.

తనదైన గాత్రంతో కొన్ని దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని ఏలిన లెజెండరీ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ తాజాగా గ్రాండ్‌గా లాంచ్ అయింది.ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement

ఈ కార్యక్రమానికి లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా సినిమా ప్రారంభం కావడం విశేషం. అంతేకాదు.. రశ్మిక మందన్నపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి కమల్ హాసన్ క్లాప్ కొట్టారు. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాస్ కలిసి నిర్మిస్తున్నారు.

గౌతమ్ తిన్ననూరికి కత్తి మీద సామే

Advertisement

‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్‌ను తెరకెక్కించనున్నారు. ఇక ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో రశ్మిక మందన్న నటించనుంది. దీనికి తోడు అనిరుధ్ రవిచందర్ సంగీతం దించనుండటంతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు పెరిగిపోయాయి.

నిజానికి ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితం అంత ఈజీగా సాగలేదు.చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆమె అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. సంగీతంలో ఆమె సాధించిన స్థానం ఒక ఎత్తయితే.. వ్యక్తిగత జీవితంలో ఎదురైన పరిస్థితులు, మహిళగా ఆమె ఎదుర్కొన్న సవాళ్లు మరో ఎత్తు. ఇన్ని విషయాలను కలిపి ఒక సినిమాగా చెప్పడం నిజంగా గౌతమ్ తిన్ననూరికి కత్తి మీద సామే.

ఎంఎస్ సుబ్బులక్ష్మి గొప్ప సంగీత సామ్రాజ్ఞి

ఇక ఈ సినిమా గురించి మాట్లాడిన కమల్ హాసన్.. ఎంఎస్ సుబ్బులక్ష్మి గొప్ప సంగీత సామ్రాజ్ఞి అని అన్నారు. ఆమె పాడిన సుప్రభాతం, లలితా సహస్రనామం, రంగపుర విహార వంటి పాటలు ఇప్పటికీ ఎంతోమంది ఇళ్లలో వినిపిస్తూనే ఉంటాయని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ కూడా ఆమె గానానికి అభిమాని అని చెప్పారు.

అయితే ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ చేసిన ఓ కామెంట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎంఎస్ సుబ్బులక్ష్మి పాత్రలో రశ్మిక నటించడంపై మాట్లాడుతూ.. సరదాగా తాను గడ్డం తీసేసినా ఆ పాత్రను చేయలేనని అనడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. అదే సమయంలో ఇలాంటి పాత్రను రశ్మిక చేయడం మెచ్చుకోతగ్గ విషయం అని అన్నారు.

లెజెండరీ గాయని పాత్రలో ఎలా మెప్పిస్తుందో

ఇక రశ్మిక కూడా ఈ సినిమా గురించి ఎమోషనల్‌గా మాట్లాడుతూ ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితంలో ఒక చిన్న భాగంగా మారే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పింది. ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి తన వంతు కష్టపడతానని తెలిపింది. ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలతో అలరించిన ఈ అమ్మడు లెజెండరీ గాయని పాత్రలో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

ఇక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా కోసం చాలా కాలంగా సిద్ధమవుతున్నట్లు తెలిపారు. దాదాపు ఏడెనిమిదేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పై రీసెర్చ్ చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.ఎంఎస్ సుబ్బులక్ష్మి కుటుంబ సభ్యులతో చర్చించి, వారి అనుమతితోనే కథను ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు.

ALSO READ:జాన్వీ, ఖుషీలకు నోటీసులు.. శ్రీదేవి ఆస్తి వివాదంలో సుప్రీం కీలక ఆదేశం

చూడాలి మరి ఓ లెజెండరీ సింగర్ బయో పిక్ ని తెరపై ఎలా చూపిస్తారో ? రశ్మిక ఆ పాత్రలో ఎలా కనిపించి మెప్పిస్తుందో !

Tags

Related News

పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ డోస్.. ఒక్క ఫొటోతో సోషల్ మీడియా షేక్!

జాన్వీ, ఖుషీలకు నోటీసులు.. శ్రీదేవి ఆస్తి వివాదంలో సుప్రీం కీలక ఆదేశం

సెన్సార్ బోర్డు పునర్వ్యవస్థీకరణ.. CBFCలో చోటు దక్కించుకున్న సుప్రియ యార్లగడ్డ

‘కాంతారా’ బ్యూటీకి అవార్డు.. రుక్మిణీ వసంత్ స్పెషల్ పోస్ట్ వైరల్!

ఎల్లమ్మలో దేవిశ్రీకి జోడీ ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ ఫిక్స్ అయినట్టే!

దేవికా రాణి నుంచి మోహన్‌లాల్ వరకు.. దాదాసాహెబ్ ఫాల్కే లిస్ట్ ఇదే!

బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. వద్దు బాబోయ్ అంటున్న మెగా ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×