Trump Govt: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో లక్ష వీసాలను రద్దు చేసింది. వాటిలో 8,000 విద్యార్థులకు సంబంధించినవి ఉన్నాయి. మరో 2,500 ప్రత్యేక వీసాలున్నట్లు ఆదేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఏడాదిలో లక్ష వీసాలను రద్దు చేయడాన్ని ఓ రికార్డుగా చెబుతున్నారు అధికారులు.
ట్రంప్ సర్కార్ అదే జోరు
అమెరికా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దూకుడు పెంచారు. అమెరికాకు వలస వచ్చేవారిని ఏదో విధంగా బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై అధికార భారం పడుతుందని ట్రంప్ సర్కార్ ఆలోచన. అందుకు అనుగుణంగా చర్యలు మొదలు పెట్టింది.
ట్రంప్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఏకంగా లక్ష వీసాలను రద్దు చేసినట్టు ఆ దేశ విదేశాంగ లెక్కలు చెబుతున్నాయి. అందులో 8 వేల మంది విద్యార్థుల వీసాలు ఉన్నాయి. మరో 2500 స్పెషల్ వీసాలు లేకపోలేదు. అంతేకాదు క్రిమినల్ యాక్టివిటీ ఉన్నవారు అందులో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాను సురక్షితంగా ఉండడానికి అలాంటి వారిని బహిష్కరిస్తూనే ఉంటామని చెప్పింది.
ఏకంగా లక్ష వీసాలు రద్దు
వీసాల రద్దుకు నాలుగు కారణాలు లేకపోలేదు. గడువును మించి అమెరికాలో ఉండటం ఒకటి. మద్యం తాగి వాహనాలు నడపడం, అలాగే దాడులు చేయడం వంటి కేసులున్నాయి. దీనికితోడు దొంగతనాలకు పాల్పడటం వంటి కేసులున్నాయి. 2024తో పోలిస్తే 150 శాతానికిపైగా వీసాల రద్దు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ట్రంప్ పాలనలో అమెరికా వలసదారుల వీసా అమలును మరింత కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. వీసాల రద్దు ప్రభావం పర్యాటకులు, విద్యార్థులు, నైపుణ్యం కలిగిన కార్మికులను ప్రభావితం చేసున్నట్లు చెబుతున్నారు. ఒక వేళ వీసాపై అమెరికాకు వచ్చిన తర్వాత వారిని నిరంతరం ట్రాక్ చేస్తోంది.
ALSO READ: ట్రంప్ సంచలన ప్రకటన.. అక్కడ తాత్కాలికంగా నేనే బాస్
దరఖాస్తు లేదా ప్రవేశ సమయంలో స్క్రీనింగ్‌పై ఆధారపడకుండా నేరాలు మోపబడి దోషులుగా నిర్ధారించినప్పుడు త్వరగా స్పందించేలా కొన్ని వ్యవస్థలు రూపొందించినట్టు అధికారులు చెబుతున్నమాట. పాలస్తీనా అనుకూల నిరసనలలో పాల్గొన్నవారు, గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రవర్తనను విమర్శించిన విద్యార్థి వీసా హోల్డర్లు, గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణకు గురవుతారని హెచ్చరించారు.
వీసా పాలసీ మార్పుల ప్రభావం భారతీయులపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు విద్య కోసం లక్షలాది మంది భారతీయులు అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చేరేవారు. ఇప్పుడు మిగతా దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం, కఠినమైన స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆలస్యం, కఠినమైన ప్రమాణాల కారణంగా 2025లో భారతీయ విద్యార్థులకు వీసాల జారీ సంఖ్య బాగా తగ్గిందట.
🚨BREAKING: The State Department has now revoked over 100,000 visas, including some 8,000 student visas and 2,500 specialized visas for individuals who had encounters with U.S. law enforcement for criminal activity.
We will continue to deport these thugs to keep America safe. pic.twitter.com/wuHVltw1bV
— Department of State (@StateDept) January 12, 2026