E-Paper
Advertisement

America: వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పుల కలకలం.. రంగంలోకి సీక్రెట్‌ సర్వీస్‌, అసలేం జరిగింది?

America: వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పుల కలకలం.. రంగంలోకి  సీక్రెట్‌ సర్వీస్‌, అసలేం జరిగింది?
Advertisement

America: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో  వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన వెనుక ఉన్నదెవరు? దీనిపై దర్యాప్తు చేసేందుకు అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ రంగంలోకి దిగింది. ఈ ఘటన వెనుక రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పుల కలకలం

Advertisement

ఇరాన్‌పై యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికాలో అధ్యక్షుడు భవనం వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఆదేశ సీక్రెట్ సర్వీస్ విభాగం రంగంలో దిగింది. వైట్‌హౌస్‌కు ఉత్తరాన 7 ఎకరాల విస్తీర్ణంలో లాఫాయెట్ పార్క్ ఉంది.ఆ పార్కులో శనివారం అర్ధరాత్రి వేళ గన్ ఫైర్ అయినట్టు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి.

వెంటనే రంగంలోకి దిగిన అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని దర్యాప్తు బృందాలు తెలిపాయి. పార్కుతోపాటు పరిసర ప్రాంతాల్లో గాలింపు సమయంలో అనుమానిత వ్యక్తులు ఎవరూ కనిపించలేదని సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు వెల్లడించారు.

Advertisement

రంగంలోకి అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌, దర్యాప్తు మొదలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వీకెండ్ వైట్‌హౌస్‌లో గడుపుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ భద్రతను మరింత పెంచారు అధికారులు. ఇరాన్‌తో యుద్ధం మొదలైన నుంచి భారీగా వైట్‌హౌస్ చూట్టూ బలగాలు మోహరించాయి. దీంతో ఆ పార్క్ చుట్టూ కంచె నిర్మాణం చేశారు.

సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ మాట్లాడుతూ డీసీ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్-యూఎస్ పార్క్ పోలీస్‌తో కలిసి సంయుక్తంగా దర్యాప్తును చేస్తున్నట్లు తెలిపారు. సమీపంలో లభించిన వాహనం, అనుమానితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో రహదారులను మూసి వేశారు.

ALSO READ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చనిపోయాడా?.. వైట్ హౌస్ క్లారిటీ

తర్వాత వాటిని తొలగించినట్టు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సంఘటనపై వైట్‌హౌస్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. వైట్‌హౌస్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×