E-Paper
Advertisement

రావణకాష్టంగా మారిన మధ్యప్రాచ్యం.. హౌతీల దాడులతో అమెరికా హైఅలర్ట్‌, అర్జెంటుగా వైట్‌హౌస్‌‌కు ట్రంప్

రావణకాష్టంగా మారిన మధ్యప్రాచ్యం..  హౌతీల దాడులతో అమెరికా హైఅలర్ట్‌,  అర్జెంటుగా వైట్‌హౌస్‌‌కు ట్రంప్
Advertisement

Middle East: హౌతీల దాడుదలతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ భగ్గుమన్నాయి. అక్కడి పరిస్థితులు రావణకాష్టంగా మారుతున్నాయి. సౌదీ అరేబియాపై వరుసగా హౌతీ దాడులతో చేయడంతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. సెలవు ముగియకముందే వైట్ హౌస్‌కు తిరిగొచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరోవైపు బ్రిటిష్ వైమానిక స్థావరం నుంచి అమెరికా బాంబర్ విమానాలు బయలుదేరినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రావణకాష్టంగా మారిన మధ్యప్రాచ్యం

మధ్యప్రాచ్యంలో యుద్ధం తగ్గిందని భావిస్తున్న తరుణంలో హౌతీలు ఎంట్రీ ఇచ్చారు. గల్ఫ్‌లోని యెమెన్‌, సౌదీఅరేబియాతోపాటు పలు దేశాలపై దాడులకు దిగాయి. అరామ్కో కేంద్రంతోపాటు సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశాయి. ఈ క్రమంలో రియాద్ విమానాశ్రయం సమీపంలో దట్టమైన పొగ, మంటలు కనిపించాయి. సౌదీలో మీడియాపై ఆంక్షలు ఉండడంతో అక్కడి సమాచారం బయటి ప్రపంచానికి తెలియలేదు. మరోవైపు అక్కడి నుంచి విమాన రాకపోకలు బాగా ఆలస్యమవుతున్నాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ విమాన రాకపోకల వివరాలు తెలిపే యాప్‌ ‘ఫ్లైట్‌ రాడార్‌ 24’ వెల్లడించింది.

సౌదీ అరేబియాపై హౌతీ వరుస దాడులు

Advertisement

హూతీలు సౌదీపై దాడులు ఉద్ధృతం చేయడాన్ని ఖండించింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. ఈ దాడులను మరింత విస్తృతం చేయడంతోపాటు వాణిజ్య భద్రతకు పెనుముప్పుగా పరిణమిస్తాయని పేర్కొంది. హూతీలకు ఆయుధాలు అందించడంపై నిషేధాన్ని అన్ని దేశాలు అమలు చేయాలని స్పష్టంచేసింది. హౌతీల దాడులతో హై అలర్ట్‌ ప్రకటించింది అమెరికా. దాడులు ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో కీలక నిర్ణయం తీసుకుంది. మిడిల్‌ ఈస్ట్‌లో ఉన్న అమెరికన్లు అలర్ట్‌గా ఉండాలని సూచన చేసింది. ఈ మేరకు రాయబార కార్యాలయాలకు హెచ్చరిక జారీ చేసింది.

ఉలిక్కిపడిన అమెరికా,  రాయబార కార్యాలకు హెచ్చరికలు

ముఖ్యంగా ఇజ్రాయెల్‌, లెబనాన్‌, జోర్డాన్‌, ఇరాక్‌ సహా 10 దేశాలకు భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. విమానాల రద్దు, గగనతలం మూసివేసే అవకాశం ఉండటంతో సిద్ధంగా ఉండాలని తమ పౌరులకు అమెరికా ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు సెలవు ముగియక ముందే వైట్‌హౌస్‌కు తిరిగి వచ్చారు అధ్యక్షుడు ట్రంప్. అక్కడ పలువురితో ఆయన సమావేశమైనట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో బ్రిటిష్ వైమానిక స్థావరం నుంచి అమెరికా బాంబర్లు బయలు దేరాయని పేర్కొన్నారు.

Advertisement

జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. రష్యా టుడే నివేదిక ప్రకారం.. అమెరికాకు చెందిన బి-1బి లాన్సర్ బాంబర్ విమానం బ్రిటన్‌లోని ఆర్‌ఏఎఫ్ ఫెయిర్‌ఫోర్డ్ వైమానిక స్థావరం నుంచి పూర్తి ఆఫ్టర్‌బర్నర్‌తో బయలుదేరింది. అదిమధ్యప్రాచ్యం వైపు పయనిస్తోందని రాసుకొచ్చింది. ఈశాన్య సిరియాలోని అల్-హసాకాలో ఉన్న ఖరాబ్ అల్-జిర్ వైమానిక స్థావరం సమీపంలో వాయు రక్షణ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఇరాన్ టీవీ పేర్కొంది.

ALSO READ: రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. భారత్‌కు 100% టారిఫ్ ముప్పు.. విదేశాంగ శాఖ రియాక్షన్ ఇదే!

పాకిస్థాన్, టర్కీ దేశాలకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్. సౌదీ అరేబియాకు మద్దతుగా సైనిక బలగాలను పంపినా, ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నా బదులిస్తామని ఘాటుగా హెచ్చరించింది. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ మధ్య ఇటీవల కుదిరిన రక్షణ ఒప్పందం నేపథ్యంలో ఈ వార్నింగ్ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను అమాంతంగా పెంచాయి.

 

Related News

రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. భారత్‌కు 100% టారిఫ్ ముప్పు.. విదేశాంగ శాఖ రియాక్షన్ ఇదే!

పాకిస్థాన్‌లో ఘోరం.. మసీదు వద్ద ఆత్మాహుతి దాడి.. 16 మంది మృతి!

లాక్‌డౌన్ దిశగా పాకిస్థాన్ అడుగులు.. ఆ తరహా ఆంక్షలు, పెళ్లిళ్లలో ఒకే వంటకం

రష్యా చమురుపై అమెరికా బిగ్ ట్విస్ట్.. భారత్ వ్యూహం ఏంటి?

రష్యాని అష్టదిగ్భందం చేసిన అమెరికా.. చమురు కొనుగోలు చేస్తే భారత్‌పై 100 శాతం పన్ను, అధికారాలు ట్రంప్‌కే

సూడాన్‌లో విషాదం.. కూలిన బంగారు గని.. 67 మంది దుర్మరణం!

ట్రంప్ పర్యటనతో తలకిందులైన సమీకరణాలు.. యూకే ప్రభుత్వానికి డెడ్‌లైన్!

Big Stories

Advertisement
×