E-Paper
Advertisement

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం
Advertisement

BMW Car Accident: అతి వేగంగా వస్తున్న BMW కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వంతెన పైనుంచి కిందకు పడిన బీఎండబ్ల్యూ కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

ముంబైలోని కోస్టల్ రోడ్డుపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వస్తున్న BMW కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కోస్టల్ రోడ్ కంట్రోల్ రూమ్ ప్రకారం.. లాలాలజపతిరాయ్ కళాశాలకు ఎదురుగా ఉన్న లాలా కళాశాల సమీపంలో ఉదయం 5.20 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మెరైన్ డ్రైవ్ నుండి హాజీ అలీ వైపు అతివేగంతో వెళ్తున్న బ్లాక్ కలర్ BMW కారు ప్రమాదానికి గురైంది. కోస్టల్ రోడ్డులోని ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది.

 కోస్టల్ రోడ్డులో BMW బీభత్సం, వంతెనపై నుంచి కిందకు

Advertisement

ఆ వాహనం.. వంతెన పైనుంచి కిందికి జారిపడి కారు పార్కింగ్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలోకి పడిపోయింది. ప్రమాదం సమయంలో కారులో నలుగురు ఉన్నారు. వెంటనే సమీపంలోని నాయర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారిలో ముగ్గురు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. మృతులు షానయ్ గజ్జల్-(21), ధైర్య దర్శన్ షెత్-(17), ఆదిత్య జకాసానియా-(19)గా గుర్తించారు. మరో వ్యక్తి ఆదిత్య కల్పేశ్వర్ ఓస్వాల్-(23) తీవ్రంగా గాయపడిన అతడు ట్రామా విభాగంలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

స్పాట్‌లో ముగ్గురు మృతి, నుజ్జు నుజ్జు అయిన కారు

ఆ కారు వంతెనకు వేలాడుతున్న సైన్‌ బోర్డును ఢీ కొట్టినట్టు తెలుస్తోంది. BMW కారు అంతా డ్యామేజ్ అయ్యింది. విండ్‌షీల్డ్ వందలాది ముక్కలుగా పగిలిపోయాయి. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడం, బంపర్ ఊడిపోయి లోపలి భాగాలు బయటపడ్డాయి. ప్రమాదం జరిగిన కచ్చితమైన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని వారాల కిందట అంటే సెప్టెంబర్ 3న కోస్టల్ రోడ్ టన్నెల్‌లో రేసింగ్ నిర్వహించినందుకు లంబోర్ఘిని, బీఎండబ్ల్యూ ఎం2, బీఎండబ్ల్యూ జెడ్4 సహా ఆరు నుంచి ఏడు సూపర్‌ కార్లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

ALSO READ: లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

 

 

Related News

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×