E-Paper
Advertisement

కేటీఆర్ క్విడ్ ప్రో కో దందా.. ఫ్రెండ్స్‌తో వ్యాపారాలు, లాభాలు మాత్రం కేటీఆర్‌కే: బండి సంజయ్

కేటీఆర్ క్విడ్ ప్రో కో దందా.. ఫ్రెండ్స్‌తో వ్యాపారాలు, లాభాలు మాత్రం కేటీఆర్‌కే: బండి సంజయ్
Advertisement

Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన స్నేహితులతో కలిసి క్విడ్‌ ప్రో కో వ్యవహారాలు నడుపుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. హైదరాబాద్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ తన ఒక ఫ్రెండ్ తో సెంట్రో చెప్పుల వ్యాపారం పెట్టించాడని, ఆ వ్యాపారాన్ని అంబానీకి అప్పగించాడన్నారు. ఇంకో ఫ్రెండ్ ఫాంహౌజ్ ను లీజుకు తీసుకున్నాడని, ప్రతిఫలంగా హుస్సేన్ సాగర్ ఎఫ్ టీఎల్ పరిధిలో బిల్డింగ్ కు పర్మిషన్లు ఇచ్చాడన్నారు. మరో ఫ్రెండ్ తో కొత్తూరులో లాజిస్టిక్ పార్క్ పెట్టించాడన్నారు. మరో ఫ్రెండ్ తో హోటల్, మెడికల్ డివైజెస్ వ్యాపారం పెట్టించారన్నారు. లాభాలు మాత్రం తానే కొట్టేస్తున్నాడని కేటీఆర్ పై ఆరోపించారు. నిజాం కాలేజీ ఫ్రెండ్ కు ఖానాపూర్ టిక్కెట్ ఇచ్చాడని, సిట్టింగ్ ఎమ్మెల్యేను గాలికొదిలేశాడని బండి విమర్శించారు.

ఫ్రెండ్స్ తో క్విడ్ ప్రో కో దందా..

Advertisement

ఫ్రెండ్స్ తో క్విడ్ ప్రో కో దందా చేస్తున్న వ్యక్తి కేటీఆర్ అని మండిపడ్డారు. ఏపీలో డీఎస్సీపై అసెంబ్లీలోనే చర్చ జరిగిందని, డీఎస్సీ అక్రమాలపై ఆధారాలుంటే చూపాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీకి కప్పం కట్టేందుకే భూదోపిడీపై బీఆర్ఎస్ తో కాంగ్రెస్ బేరసారాలు షురూ చేసిందని ఆరోపించారు. అన్నీ ఆధారాలున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను ఫాంహౌజ్ కు పంపడం పక్కా రాజకీయ డ్రామానే అని బండి పేర్కొన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమని, ముస్లిం ఓట్లతో కాంగ్రెస్ గెలవాలని చూస్తోందన్నారు. మెజారిటీ హిందూ ఓటర్లు ఐక్యంగా ఉండలేరని కాంగ్రెస్ ధీమా అని తెలిపారు. మజ్లిస్ మద్దతుతో కాంగ్రెస్ గెలవాలని స్కెచ్ వేస్తోందన్నారు. హిందూ ఓటర్లు.. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుట్రలను గమనించాలని కేంద్ర మంత్రి సంజయ్ కోరారు. హిందూ ఓటర్ల సత్తా ఏమిటో ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో చూపాలన్నారు.

51 వేల మందికి అపాయిట్ మెంట్ లెటర్లు..

Advertisement

అనంతరం జూబ్లీహిల్స్ ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన రోజ్ గార్ మేళాకు హాజరై మాట్లాడారు. రోజ్ గార్ మేళా ద్వారా ఇప్పటికే 12.24 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని, తాజాగా మరో 51 వేల ఉద్యోగాలను భర్తీ చేసి అపాయిట్ మెంట్ లెటర్లు అందించినట్లు చెప్పారు. పేపర్ లీకేజీలు, ప్యాకేజీలు, పైరవీలకు తావు లేకుండా మెరిట్ ప్రాతిపదికగా లక్షల ఉద్యోగాల భర్తీ చేయడం మోడీకే చెల్లిందన్నారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎట్లా భ్రష్టు పట్టిందో అందరికీ తెలిసిందేనని ఎద్దేవాచేశారు.

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గందరగోళం..

లీకేజీలు, ప్యాకేజీలు, కోర్టు కేసులతోనే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గందరగోళంగా మారిందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం బండి సంజయ్ సిరిసిల్లకు వెళ్తుండగా సిద్దిపేట నుంచి గజ్వేల్ వెళుతున్న కారు డివైడర్ ను ఢీ కొని పల్టీలు కొట్టింది. దీంతో హుటాహుటిన కారు వద్దకు వెళ్లి భద్రతా సిబ్బందితో కలిసి బాధితులను కారులో నుంచి బయటకు తీశారు. పోలీస్ వాహనంలో వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని కేంద్ర మంత్రి పోలీసులను కోరారు. కారు ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది.

Also Read: రైతుల కోసం మంత్రి ఉత్తమ్‌కు డీకే అరుణ ఫోన్.. జూరాల నీటిపై కీలక విజ్ఞప్తి

Tags

Related News

ఖైరతాబాద్‌లో బిగ్ ట్విస్ట్.. దానంకు ఊహించని ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్!

కరీంనగర్‌లో దొంగల బీభత్సం.. ఒకేరోజు రెండు ఏటీఎమ్‌లలో భారీ చోరీ!

ఐఎస్ సదన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఐదేళ్ల బాలుడి దుర్మరణం

రైతుల కోసం మంత్రి ఉత్తమ్‌కు డీకే అరుణ ఫోన్.. జూరాల నీటిపై కీలక విజ్ఞప్తి

మేడిగడ్డ సీక్రెట్ రిపోర్ట్ నా దగ్గరుంది.. బాంబు పేల్చిన మాజీ మంత్రి హరీశ్ రావు!

ఖైరతాబాద్‌పై గులాబీ మార్క్ వ్యూహం.. బైపోల్ గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్లాన్!

తెలంగాణ ఉపాధి హామీ కూలీలకు షాక్.. ఈ-కేవైసీ లేకపోతే వేతనాలు బంద్!

Big Stories

Advertisement
×