Maha Bharatham Bheemudu: మహాభారతం ధారావాహిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మహాభారతంలోని కీలక ఘట్టాలను తెరపై చూపిస్తూ సంచలన విజయం సొంతం చేసుకుంది ఈ సీరియల్. ఇక ఈ మహాభారతంలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ఎంతో మంది సెలబ్రిటీలు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కూడా.. అంతేకాదు వారు బయటకు వస్తే వారి పాత్రలే మనకు కనిపిస్తాయి కానీ వారి అసలు బ్యాక్ గ్రౌండ్ తెలియదనే చెప్పాలి. ఇకపోతే ఈ మహాభారతం సీరియల్ లో కుంతీదేవి పుత్రుడిగా భీముడి పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకున్న రెజ్లర్ సౌరవ్ గుర్జర్ (Saurav Gurjar) అందరికీ గుర్తుండే ఉంటారు. తన అసాధారణమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈయనపై ఇప్పుడు కేసు ఫైల్ అవ్వడం సంచలనంగా మారింది.
సౌరవ్ గుర్జర్ పై ఒక యువతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే.. తనను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి, మోసం చేసి ఇప్పుడు వేధిస్తున్నాడు అనే ఆరోపణలతో ఆ మహిళ ఫిర్యాదు చేయడంతో సౌరవ్ పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నా. తనను పెళ్లి చేసుకుంటానని, భార్యకు ఉండే హక్కులతో సమానమైన హక్కులు కల్పిస్తానని హామీ ఇచ్చారని , ఆ తర్వాత శారీరకంగా, మానసికంగా కూడా వేధించాడు అంటూ ఆమె ఆగస్టు 15 గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించిందట.
ఫిర్యాదు ప్రకారం.. మేమిద్దరం 2021లో ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నాము. ఆ తర్వాత వాట్సప్ ద్వారా మా సన్నిహిత బంధాన్ని ఏర్పరచుకున్నాము.. 2021 డిసెంబర్ 25న మొదటిసారి వ్యక్తిగతంగా కలుసుకున్నాము. అయితే యునైటెడ్ స్టేట్స్ లో నేను ఉన్నప్పుడు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత కూడా మా బంధం కొనసాగింది. మేమిద్దరం కలిసి వ్యాపారం కూడా చేద్దామని అనుకున్నాము. అందుకు తగ్గట్టుగానే సౌరవ్ నాకు ప్రామిస్ కూడా ఇచ్చారు. దాంతో అమెరికాలో ఉన్న నా ఉద్యోగాన్ని మానుకోవాల్సి వచ్చింది. అలా మానుకునేలా సౌరవ్ గుర్జర్ నన్ను ప్రేరేపించాడు” అంటూ ఆమె ఆరోపించింది.
గుర్జర్ వేధింపుల వల్ల నేను నా పనిపై దృష్టి పెట్టలేకపోయాను. పెళ్లి గురించి అడిగిన ప్రతిసారి తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేసి నన్ను దూరంగా పెట్టేవాడు. 2025 అక్టోబర్ నుండి 2026 మార్చి వరకు నాతోనే ఉన్నాడు. ఆ తర్వాత హైదరాబాద్లో కొంతకాలం కలిసి నివసించాము. అయితే చెప్పాపెట్టకుండా అదృశ్యమయ్యాడు” అంటూ ఆరోపణలు గుప్పించింది. ఇక ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
also read: ఇరుముడి: థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఓటీటీలో విమర్శలు?
రిమాండ్ కోసం కోర్టులో త్వరలో ఇతడిని హాజరు పరిచే అవకాశాలున్నట్లు సమాచారం ..ఏది ఏమైనా గుర్జర్ మహాభారతం సీరియల్ లో తన అద్భుతమైన నటన ప్రతిభతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈయన ఇప్పుడు ఒక మహిళను మానసికంగా, శారీరకంగా వేధించాడనే కోణంలో కేసు ఫైల్ అవ్వడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విషయాలపై నిజా నిజాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.