E-Paper
Advertisement

రష్యా చమురుపై అమెరికా బిగ్ ట్విస్ట్.. భారత్ వ్యూహం ఏంటి?

రష్యా చమురుపై అమెరికా బిగ్ ట్విస్ట్.. భారత్ వ్యూహం ఏంటి?
Advertisement

Russian Oil: రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా కత్తి దూసింది. ఆ దేశం నుంచి క్రూడ్ ఆయిల్, గ్యాస్ దిగుమతి చేసుకునే దేశాలపై.. వంద శాతం వరకు సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి కల్పించే బిల్లుకు.. అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026 పేరుతో ఉన్న ఈ బిల్లు.. 262-159 ఓట్లతో నెగ్గింది. గత నెలలోనే సెనేట్ 86-11 ఓట్లతో దీనికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు ట్రంప్ సంతకంతో చట్టంగా మారుతుంది.

రష్యా చమురు కొనే దేశాలే టార్గెట్..

Advertisement

చైనా, భారత్‌తో పాటు రష్యా చమురు కొనే దేశాలే ఈ బిల్లు టార్గెట్. గత ఆర్థిక సంవత్సరంలో.. భారత్ ముడి చమురు దిగుమతుల్లో.. దాదాపు 30 శాతం రష్యా నుంచే వచ్చాయి. అంటే, భారత ఎగుమతులపై వంద శాతం సుంకాల ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో విదేశాంగ శాఖ స్పందించింది. ఈ బిల్లును ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని ప్రకటించింది. గతంలో చెప్పినట్టుగానే, 140 కోట్ల మంది ప్రజలకు ఇంధన భద్రత కల్పించడానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపింది. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు.. వేర్వేరు వనరుల నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తామంది.

అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై ప్రభావం..

Advertisement

రష్యా చమురు వాణిజ్యంపై అమెరికా ప్రతినిధులతో ఇప్పటికే చర్చించామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ బిల్లు ద్వైపాక్షిక సంబంధాలపైనే కాదు, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పైనా ప్రభావం చూపుతుందని అమెరికాకు స్పష్టం చేసినట్టు తెలిపింది. భారత వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామంది విదేశాంగ శాఖ. ఇది గనక చట్టరూపం దాలిస్తే.. వాణిజ్యంపై పడే ప్రభావాలను ఎదుర్కొనేందుకు వాణిజ్య, పారిశ్రామిక సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. కొద్ది నెలల క్రితమే ట్రంప్ ప్రభుత్వం భారత వస్తువులపై 25 శాతం రష్యా సుంకాన్ని తొలగించింది. ఇప్పుడు మళ్లీ కొత్త ముప్పు ముందుకొచ్చింది. బిల్లు పాసైంది కానీ, సుంకాల నిర్ణయం మాత్రం ట్రంప్ చేతిలోనే ఉంది.

Also Read: భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..

Tags

Related News

రష్యాని అష్టదిగ్భందం చేసిన అమెరికా.. చమురు కొనుగోలు చేస్తే భారత్‌పై 100 శాతం పన్ను, అధికారాలు ట్రంప్‌కే

సూడాన్‌లో విషాదం.. కూలిన బంగారు గని.. 67 మంది దుర్మరణం!

ట్రంప్ పర్యటనతో తలకిందులైన సమీకరణాలు.. యూకే ప్రభుత్వానికి డెడ్‌లైన్!

సౌదీకి మరో బంగారు పంట.. భారీగా యురేనియం నిక్షేపాలు గుర్తింపు

న్యూయార్క్‌ సబ్‌వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం.. భారత సంతతి మహిళ, ఆమె ఫ్రెండ్‌పై దూసుకెళ్లిన రైలు

బోరిస్ జాన్సన్ ప్రయాణిస్తున్న రైలుపై రష్యా డ్రోన్ దాడి.. త్రుటిలో తప్పిన ప్రాణపాయం!

బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

Big Stories

Advertisement
×