E-Paper
Advertisement

ఐఎస్ సదన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఐదేళ్ల బాలుడి దుర్మరణం

ఐఎస్ సదన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఐదేళ్ల బాలుడి దుర్మరణం
Advertisement

IS Sadan Accident: హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్‌కు వచ్చి, ఆనందంగా గడపాల్సిన ఒక ఐదేళ్ల బాలుడు కారు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందడం ఆ ప్రాంతంలో తీవ్ర శోకాన్ని నింపింది.

హోటల్‌కు వచ్చి అనంతలోకాలకు..

Advertisement

బాధితుల వివరాల ప్రకారం.. మొహియుద్దీన్ తన కుటుంబంతో కలిసి ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్డులోని ఒక హోటల్‌కు భోజనం కోసం వచ్చారు. తల్లిదండ్రులు ఆహారం తీసుకుంటున్న సమయంలో వారి కుమారుడు ఇజాన్‌ఉద్దీన్ (ఇజ్ఞాన్ ఉద్దీన్) అనుకోకుండా ఒక్కడే రోడ్డుపైకి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో అత్యంత వేగంగా వచ్చిన ఒక కారు చిన్నారిని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బాలుడు అక్కడికక్కడే కూలిపోయాడు.

చికిత్స పొందుతూ కన్నుమూత

Advertisement

రక్తపు మడుగులో పడివున్న చిన్నారిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు ధృవీకరించారు. చిన్నారి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read: కేటీఆర్ క్విడ్ ప్రో కో దందా.. ఫ్రెండ్స్‌తో వ్యాపారాలు, లాభాలు మాత్రం కేటీఆర్‌కే: బండి సంజయ్

పారిపోయిన డ్రైవర్.. సీసీటీవీ దృశ్యాలు లభ్యం

ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారును ఆపకుండా అక్కడి నుంచి వేగంగా పారిపోయాడు. ఈ ఘోర ఘటనా దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న ఐఎస్ సదన్ పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారును, డ్రైవర్‌ను గుర్తించే పనిలో పడ్డారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి పోలీసులు హామీ ఇచ్చారు.

Tags

Related News

ఖైరతాబాద్‌లో బిగ్ ట్విస్ట్.. దానంకు ఊహించని ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్!

కరీంనగర్‌లో దొంగల బీభత్సం.. ఒకేరోజు రెండు ఏటీఎమ్‌లలో భారీ చోరీ!

కేటీఆర్ క్విడ్ ప్రో కో దందా.. ఫ్రెండ్స్‌తో వ్యాపారాలు, లాభాలు మాత్రం కేటీఆర్‌కే: బండి సంజయ్

రైతుల కోసం మంత్రి ఉత్తమ్‌కు డీకే అరుణ ఫోన్.. జూరాల నీటిపై కీలక విజ్ఞప్తి

మేడిగడ్డ సీక్రెట్ రిపోర్ట్ నా దగ్గరుంది.. బాంబు పేల్చిన మాజీ మంత్రి హరీశ్ రావు!

ఖైరతాబాద్‌పై గులాబీ మార్క్ వ్యూహం.. బైపోల్ గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్లాన్!

తెలంగాణ ఉపాధి హామీ కూలీలకు షాక్.. ఈ-కేవైసీ లేకపోతే వేతనాలు బంద్!

Big Stories

Advertisement
×