E-Paper
Advertisement

ఇరాన్ యుద్ధం వేళ అమెరికా సైన్యంలో లుకలుకలు.. ఆర్మీ చీఫ్‌పై వేటు, వేగంగా మారుతున్న సమీకరణాలు

ఇరాన్ యుద్ధం వేళ అమెరికా సైన్యంలో లుకలుకలు..  ఆర్మీ చీఫ్‌పై వేటు, వేగంగా మారుతున్న సమీకరణాలు
Advertisement

War with Iran: ఇరాన్ యుద్ధాన్ని రెండు లేదా మూడు వారాల్లో ముగించాలని భావిస్తోంది అమెరికా. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. తాజాగా అమెరికా ఆర్మీ చీఫ్‌పై వేటు వేసింది. భీకరంగా దాడులు సాగుతున్న సమయంలో ఆయన్ని ఎందుకు అమెరికా తొలగించింది? తాజా చర్య పశ్చిమాసియాలో సైనిక చర్యపై ఏ మాత్రం ప్రభావం చూపుతుంది?

ఇరాన్ యుద్ధం వేళ అమెరికా సైన్యంలో లుకలుకలు

Advertisement

ఇరాన్‌‌పై దాడులు తీవ్రతరం చేశాయి అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్‌ ర్యాండీ జార్జ్‌‌పై వేటు పడింది. పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ కోరినట్టు పెంటగాన్ రక్షణ వర్గాలు తెలిపాయి.

ఈ మేరకు ఆయన వెంటనే రాజీనామా చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు జోరందుకున్నాయి. ఆయన రాజీనామా వెనుక ఏం జరిగింది. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఇరాన్‌తో యుద్ధం మొదలై నుంచి రక్షణ శాఖలో కీలక అధికారులపై ఎందుకు ఆదేశ ప్రభుత్వం వేటు వస్తోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

Advertisement

అమెరికా ఆర్మీ చీఫ్‌పై వేటు..  క్రిస్టోఫర్ లానెవ్ బాధ్యతలు చేపట్టే అవకాశం

ర్యాండీ జార్జ్‌‌ ఎవరు? 1982లో యూఎస్ సైన్యంలో చేరారు ఆయన. 1988లో వెస్ట్ పాయింట్‌లోని వెస్ట్‌పాయింట్‌ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్‌ సాధించారు. గల్ఫ్‌ యుద్ధంతో ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌ల్లో ఆయన తన సేవలు అందించారు. జో బైడెన్‌ ప్రభుత్వంలో 2021-2022 వరకు రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌కు సహాయకుడిగా పని చేసిన అనుభవం ఆయన సొంతం.

మరి ఏం జరిగిందో తెలీదుగానీ గత ఫిబ్రవరి నుంచి అనేకమంది ఉన్నతస్థాయి అధికారులను పదవుల నుంచి తొలగించారు అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్‌. తొలుత జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌ జనరల్‌ చార్లెస్‌ సీక్యూ బ్రౌన్‌పై వేటు పడింది. ఆ తర్వాత సైనిక జనరల్స్‌, అడ్మిరల్స్‌ ముందస్తు పదవీ విరమణ చేశారు. ఆ సమయంలో జార్జ్‌ బయటపడ్డారు.

తాజాగా ఆయన్ని కూడా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ర్యాండీ సేవలను కొనియాడుతూ అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటివరకు డజను మందికి పైగా ఉన్నతస్థాయి జనరల్స్‌, అడ్మిరల్స్‌ను పదవి నుంచి తొలగించింది ట్రంప్ సర్కార్.

ALSO READ: ఇరాన్‌పై దాడులు ముమ్మరం.. అతిపెద్ద వంతెన పేల్చివేసిన బలగాలు, ట్రంప్ క్లారిటీ 

ఇరాన్ యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా సైన్యంలో లుకలుకలు లేకపోలేదు. రెండు దశాబ్దాలలో పశ్చిమాసియాలో అమెరికా చేస్తున్న అతిపెద్ద సంఘర్షణ ఇది. ఆర్మీ జనరల్ తన పదవి నుండి వైదొలిగి వెంటనే పెంటగాన్‌లో ఖాళీ ఏర్పడింది. ఆర్మీ చీఫ్ జార్జ్‌కు వ్యతిరేకంగా రక్షణమంత్రి తీసుకున్న చర్యకు అధికారికంగా ఎలాంటి కారణాలు వెల్లడించలేదు.

మాజీ మధ్య స్థాయి ఆర్మీ నేషనల్ గార్డ్ అధికారి హెగ్సెత్, చాలా మంది ఆర్మీ జనరల్స్‌ను ధిక్కరించారట. తనకు మద్దతు ఇవ్వని పలువురిని తొలగించడానికి, పదోన్నతులను అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నది అమెరికా మీడియాలో కథనాలు లేకపోలేదు. బైడెన్ పాలనలో అప్పటి రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో జార్జ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అదే పదవీ విరమణకు కారణమై ఉండవచ్చని చాలామంది అనుమానిస్తున్నారు. తాత్కాలిక ఆర్మీ చీఫ్‌గా జనరల్ క్రిస్టోఫర్ లానెవ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు పెంటగాన్ అధికారి తెలిపారు.

 

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×