Vastu Tips for Turtle Statue: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. అలాంటి వాటిలో తాబేలు అత్యంత ముఖ్యమైంది. తాబేలును విష్ణుమూర్తి స్వరూపంగా, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అయితే.. దీనిని ఏ దిశలో ఉంచాలి? ఏ పదార్థంతో చేసిన తాబేలు శ్రేష్ఠం? వంటి నియమాలు పాటించకపోతే.. ఆశించిన ఫలితాలు రావు. తాబేలు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన వాస్తు నియమాల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం ఇంట్లో తాబేలు- అదృష్టం, శ్రేయస్సుకు మార్గం:
హిందూ పురాణాల ప్రకారం.. క్షీరసాగర మథనం సమయంలో.. శ్రీ మహావిష్ణువు ‘కూర్మావతారం’ (తాబేలు) ఎత్తాడు. అందుకే తాబేలును లక్ష్మీదేవికి ప్రతి రూపంగా.. ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణిస్తారు. సరైన దిశలో తాబేలును ఉంచడం వల్ల ఇంట్లోని ప్రతికూలత తొలగిపోయి.. ప్రశాంతత లభిస్తుంది.
1. ఏ పదార్థంతో చేసిన తాబేలు వాడాలి?
తాబేలు ఏ పదార్థంతో తయారైందనేది అది ఉంచే దిశపై ఆధారపడి ఉంటుంది.
లోహపు తాబేలు: వెండి లేదా రాగితో చేసిన తాబేళ్లను ఉత్తర లేదా వాయువ్య దిశలో ఉంచాలి.
స్పటిక తాబేలు: కెరీర్‌లో ఎదుగుదల కోసం దీనిని నైరుతి లేదా వాయువ్య దిశలో ఉంచడం మంచిది.
మట్టి తాబేలు: మట్టి లేదా సెరామిక్ తాబేళ్లను ఈశాన్య లేదా నైరుతి దిశలో ఉంచాలి.
చెక్క తాబేలు: తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
2.సరైన దిశ,స్థానం:
వాస్తు శాస్త్రం ప్రకారం.. తాబేలును ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉంచడం బెస్ట్. ఉత్తర దిశను కుబేరుడి స్థానంగా భావిస్తారు. ఇక్కడ తాబేలును ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి..సంపద వృద్ధి చెందుతుంది.
ముఖం ఎటువైపు ఉండాలి?: తాబేలు ముఖం ఎల్లప్పుడూ ఇంటి లోపలి వైపు చూస్తున్నట్లు ఉండాలి. దీని వల్ల అదృష్టం ఇంటి బయటకు వెళ్లకుండా లోపలికే వస్తుందని నమ్మకం.
3.నీటిలో ఉంచడం వల్ల ప్రయోజనం:
తాబేలు విగ్రహాన్ని ఒక గాజు గిన్నెలో లేదా వెడల్పాటి పాత్రలో నీరు పోసి ఉంచడం చాలా శుభప్రదం.
నీరు తాబేలు పాదాలను తాకేలా ఉండాలి.
ప్రతి రోజూ ఆ నీటిని మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ వైబ్స్ పెరుగుతాయి.
Also Read: అలాంటి లక్షణాలు ఉన్న అమాయిలకే కుబేర యోగం ఉంటుందట
4. కుటుంబ శాంతి, ఆరోగ్యం:
ఇంట్లో గొడవలు జరుగుతుంటే.. పీఠంపై కూర్చున్న తాబేలు జంటను ఉంచడం వల్ల సంబంధాలు బలపడతాయి. అలాగే.. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తమ బెడ్‌రూమ్‌లో తాబేలును ఉంచుకోవచ్చు (కానీ తల వైపు కాదు). ఇది ఆయుష్షును పెంచుతుందని వాస్తు నిపుణులు చెబుతారు.
5.వ్యాపార, ఆఫీసు ప్రదేశాల్లో:
మీరు వ్యాపారంలో.. నష్టపోతుంటే లేదా ఆఫీసులో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తుంటే..మీ పని ప్రదేశంలో లోహపు తాబేలును ఉంచండి. ఇది ఏకాగ్రతను పెంచడమే కాకుండా.. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది.
తాబేలు కేవలం అలంకార వస్తువు మాత్రమే కాదు. అది శక్తికి మూలం. పైన పేర్కొన్న వాస్తు నియమాలను అనుసరించి తాబేలును ఇంట్లో ప్రతిష్ఠించుకుంటే.. అష్టైశ్వర్యాలతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది.