E-Paper
Advertisement

వైట్‌హౌస్ సమీపంలో కలకలం.. 30 రౌండ్లు కాల్పులా? రంగంలోకి సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు, మూడోసారి

వైట్‌హౌస్ సమీపంలో కలకలం..  30 రౌండ్లు కాల్పులా? రంగంలోకి  సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు, మూడోసారి
Advertisement

White House Shooting: అమెరికాలో ఏం జరుగుతోంది? ఎందుకు పదే పదే కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి? గడిచిన రెండు నెలల్లో ఈ తరహా ఘటనలు జరగడం మూడోసారి. ఇంతకీ ఇది ఎవరి పని? అధ్యక్షుడి పాలనపై ఆగ్రహంగా ఉన్నవారు చేశారా? లేకుంటే ఎవరి ప్రమేయమైనా ఉందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

వైట్‌హౌస్ సమీపంలో కలకలం.. ఇది మూడోసారి

Advertisement

అమెరికాలో అధ్యక్షుడు నివాసం సమీపంలో ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఈ విధంగా కాల్పుల ఘటనలు జరగడం ఇది మూడోసారి. తాజా ఘటన వైట్ హౌస్‌లోకి ఓ వ్యక్తి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఉదయం ఈ ఘటన జరిగింది.

సీక్రెట్‌ సర్వీస్‌ చెక్‌పాయింట్‌ వద్దకు దూసుకొచ్చిన ఓ వ్యక్తి బలగాలపై పలుమార్లు కాల్పులకు అక్కడి మీడియా చెబుతోంది. పరిస్థితి గమనించిన సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు వెల్లడించారు.

Advertisement

రంగంలోకి సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు, ఆపై ఎదురుకాల్పులు

వరుస కాల్పుల శబ్దాలు జర్నలిస్టులు విన్నారు. పరిస్థితి గమనించిన అధికారులు.. జర్నలిస్టులను శ్వేతసౌధం ప్రెస్‌ బ్రీఫింగ్‌ రూమ్‌లోకి వెళ్లాలని ఆదేశించారు. కాల్పుల ఘటన నేపథ్యంలో సీక్రెట్ సర్వీసు అధికారులు, ఎఫ్‌బీఐ, స్థానిక పోలీసులు వైట్‌హౌస్‌ వద్ద భారీగా మోహరించారు. అయితే కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్‌ శ్వేతసౌధంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాల్పులకు తెగబడిన నిందితుడి వయస్సు 21 ఏళ్లు. అతడ్ని నసీర్ బెస్ట్‌గా గుర్తించారు. ఇతడు గతంలో చాలా సార్లు వైట్ హౌస్‌లోకి చొరబడటానికి ప్రయత్నించినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. నసీర్ బెస్ట్ అక్కడి కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత ఒక చెక్‌పాయింట్ వద్దకు వచ్చాడు.

ఆ తర్వాత తన బ్యాగ్ నుండి ఆయుధాన్ని తీసి సెక్యూరిటీ అధికారులపై కాల్పులు జరపడం ప్రారంభించాడని యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఓ ప్రకటనలో తెలిపింది. అధికారులు ఎదురు కాల్పులు జరపడంతో అనుమానితుడు తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు సీక్రెట్ సర్వీస్ విభాగం తెలిపింది.

ALSO READ: ట్రంప్ మరో సంచలనం.. గ్రీన్ కార్డ్ రూల్స్ మార్పు.. అమెరికాలో ఉంటే నో ఛాన్స్!

ఈ ఘటనలో అధికారులెవరూ గాయపడలేదు. ఘటన సమయంలో వైట్ హౌస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఉన్నా, ఘటన ప్రభావం ఆయనపై పడలేదని సీక్రెట్ సర్వీస్ వర్గాలు తెలిపాయి. నసీర్ బెస్ట్ ఎవరు? ఫాక్స్ న్యూస్ ప్రకారం.. 21 ఏళ్ల నసీర్ బెస్ట్ రివాల్వర్‌ను ఉపయోగించి కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. సీక్రెట్ సర్వీస్ జరిగిన ఎదురు కాల్పుల్లో అతడు హతమయ్యాడు. అతను మేరీల్యాండ్‌ ప్రాంతానికి చెందినవాడు.

జూన్ 26, 2025న బెస్ట్ ఏజెంట్లను ఆపి బెదిరింపులకు పాల్పడటంతో అతడిని అదుపులోకి తీసుకుంది సీక్రెట్ సర్వీస్. నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించినందుకు జూలై 10, 2025న మళ్లీ అదుపులోకి తీసుకున్నారని పేర్కొంది. మానసికంగా సరిగా లేని వ్యక్తి అని ఓ న్యూస్ ఏజెన్సీ రాసుకొచ్చింది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం, బెస్ట్ సీక్రెట్ సర్వీస్‌కు తెలిసిన వాడేనని రాసుకొచ్చింది. వైట్ హౌస్‌కు దూరంగా ఉండమని గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వును అతను ఉల్లంఘించాడని తెలిసింది.

 

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×