E-Paper
Advertisement

ట్రంప్ మరో సంచలనం.. గ్రీన్ కార్డ్ రూల్స్ మార్పు.. అమెరికాలో ఉంటే నో ఛాన్స్!

ట్రంప్ మరో సంచలనం.. గ్రీన్ కార్డ్ రూల్స్ మార్పు.. అమెరికాలో ఉంటే నో ఛాన్స్!
Advertisement

Green Card: అమెరికా గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూసే వారికి ట్రంప్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. యూఎస్ పౌరసత్వం, వలస సేవల విభాగం (USCIS) తాజాగా విడుదల చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే మెజారిటీ ప్రజలు అమెరికా వెలుపల (తమ సొంత దేశాల) నుంచే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అమెరికాలోనే ఉంటూ తమ పౌరసత్వ హోదాను మార్చుకోవడానికి ఏమాత్రం వీలుండదు.

అసలేం జరిగింది?

ఇప్పటివరకు చాలా మంది విదేశీయులు ఏదో ఒక తాత్కాలిక వీసా (H-1B, L1 లేదా స్టూడెంట్ వీసా) పై అమెరికాలో ఉంటూనే గ్రీన్ కార్డ్ ప్రక్రియను పూర్తి చేసేవారు. దీనిని ‘అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్’ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు మారిన రూల్స్ ప్రకారం.. మెజారిటీ దరఖాస్తుదారులు అమెరికాలో ఉంటూ ఈ ప్రక్రియను పూర్తి చేయడం కుదరదు. వారు కచ్చితంగా అమెరికా వెలుపలి నుంచే అంటే తమ స్వదేశంలో ఉండే యూఎస్ ఎంబసీ లేదా కాన్సులేట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నిర్ణయానికి గల కారణాలు

Advertisement

అమెరికాలోకి ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ (అక్రమ వలసలు)ను అరికట్టడం, వీసా దుర్వినియోగాన్ని తగ్గించడం ఈ కొత్త నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని శ్వేత సౌధం అధికారులు చెబుతున్నారు. మరోవైపు తాత్కాలిక వీసాల మీద వచ్చి ఇక్కడే ఉండిపోయి పర్మినెంట్ రెసిడెన్సీ కోసం ట్రై చేసే పద్ధతికి అడ్డుకట్ట వేయాలని ఇమ్మిగ్రేషన్ శాఖ భావిస్తోంది. అంతేకాకుండా అమెరికా లోపల ఇమ్మిగ్రేషన్ విభాగంపై ఉన్న పనిభారాన్ని తగ్గించి కాన్సులర్ ప్రాసెసింగ్‌ను బలోపేతం చేయడం కూడా ఈ నిర్ణయంలో భాగమని యూఎస్ అధికారులు చెబుతున్నారు.

భారతీయులపై పెను ప్రభావం

ఈ కొత్త రూల్స్ వల్ల అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న వారితో పాటు ఇప్పటికే అక్కడ స్థిరపడాలని చూస్తున్న వారిపై తీవ్ర ప్రభావం పడనుంది. వివిధ కంపెనీల ద్వారా గ్రీన్ కార్డ్స్ కోసం అప్లై చేసే ఉద్యోగులు కూడా తాజా నిబంధనలతో ప్రభావితం కానున్నారు. అలాగే అమెరికాలో ఉన్న బంధువుల సాయంతో గ్రీన్ కార్డ్స్ ఆశించేవారికి సైతం ఇది ఛేదు వార్త కానుంది. మరి ముఖ్యంగా అమెరికా గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్న భారతీయులకు ఇది మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Also Read: కిరాణా స్టోర్‌కు వెళ్లిన.. 10 ఏళ్ల బాలిక దారుణ హత్య.. సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

అమెరికన్ దిగ్గజాల అసహనం

గ్రీన్ కార్డు జారీపై ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన తాజా నిబంధనలపై అమెరికా దిగ్గజ వ్యాపారవేత్తలు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. లింక్డ్‌ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మన్.. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఏఐ పరిశోధకులు, విద్యార్థులు తమ పనిని ఆపేసి విదేశాల్లోని రాయబార కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం కలిగిస్తుందని అన్నారు. మరోవైపు బూమ్ సూపర్ సోనిక్ వ్యవస్థాపకుడు బ్లేక్ స్కోల్, నిక్ డేవిడోవ్ వంటి వ్యాపారవేత్తలు సైతం.. గ్రీన్ కార్డ్ కొత్త రూల్స్ ను తప్పుబట్టారు. అమెరికా శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఇన్నాళ్లు కష్టపడుతూ వచ్చిన వారిని బయటకు పంపడం ఏ మాత్రం సమర్ధనీయం కాదని పేర్కొన్నారు.

Also Read: ఫ్రిడ్జ్ అక్కర్లేదు.. కానీ నీళ్లు ఐస్‌లా చల్లబడతాయ్.. 3,000 ఏళ్ల నాటి అద్భుత టెక్నిక్!

Related News

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

హర్మూజ్‌ జలసంధిలో యుద్ధమేఘాలు.. రాకెట్ల సాయంతో సముద్రంలోకి సీమైన్స్‌, పేల్చిన అమెరికా

బ్యాంకులు, ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్, నైట్‌క్లబ్‌లు ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు.. స్పాట్ రెజిస్ట్రేషన్..

Big Stories

Advertisement
×