Govinda:సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR), ఏఎన్నార్ (ANR)కాలంలో హీరోలు రోజుకి నాలుగు లేదా ఐదు షిఫ్ట్ లు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు ఒకే ఏడాది 10 కి మించిన సినిమాలు రిలీజ్ చేసిన హీరోలు కూడా ఉన్నారు.కానీ ఇప్పట్లో హీరోలు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తారు. దీనికి తోడు సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయడానికి కూడా పరిస్థితులు గగనంగా మారిపోయాయి. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో కూడా ఒక హీరో ఏకంగా రోజుకి ఐదు షిఫ్టులు, పైగా 14 సినిమాలలో ఒకేసారి నటించాడని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే సినిమాల కోసం ఇంత కష్టపడిన ఆ హీరోని ప్రశంసించడం అటు పక్కన పెడితే.. ఆయనపై లేనిపోని నిందలు వేశారు అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకొని ఎమోషనల్ అయ్యారు. పైగా షూటింగ్ కి లేటుగా వస్తారని చేసిన కామెంట్లు ఆయనను మానసికంగా మరింత ఇబ్బంది పెట్టాయట. మరి ఆ హీరో ఎవరు? ఈ జనరేషన్ లో కూడా అలా సినిమాలు చేసి ఆఖరికి నిందలు మోస్తున్న ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం..
ALSO READ:Baaghi 4: ఓటీటీలోకి బాఘీ 4.. స్ట్రీమింగ్ అప్పుడే!
ఆయన ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ హీరో గోవిందా(Govinda) . తాజాగా ఈయన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ (Kajol), ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna) హోస్ట్ గా చేస్తున్న “టూ మచ్” అనే టాక్ షో కి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ షోలో భాగంగానే తాను షూటింగ్ కి లేటుగా వస్తాడు అనే ముద్రపై వివరణ ఇచ్చారు. నటుడు గోవిందా మాట్లాడుతూ.. ఒకేసారి ఐదు షిఫ్టులు చేసి , 14 సినిమాలు చేయడంతో సమయానికి రావడం సాధ్యం కాలేదు అందుకే నన్ను టార్గెట్ చేశారు. నటులు ఒక్క సినిమాకే అలసిపోతారు. కానీ నేను అన్ని సినిమాలు చేయడంతో బర్న్ అవుట్ అయ్యాను. ఒకేసారి 14 సినిమాలలో ఐదు షిఫ్ట్ లు చేశాను. అయినా నాపై లేట్ గా వస్తారు అనే ముద్ర వేసి నిందలు వేశారు” అంటూ గోవిందా తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే ఒకప్పుడు వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన గోవిందా ఈ మధ్య పెద్దగా సినిమాలలో కనిపించడం లేదు అని చెప్పవచ్చు. అయితే దీనికి కారణం ఆయన జ్యోతిష్కుల మాటలు వినడమే అని నిర్మాత, సెన్సార్ బోర్డ్ మాజీ సభ్యుడు పహ్లాజ్ నిహాలాని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఇకపోతే ఆయన మాట్లాడుతూ..” గోవిందా ఆల్ రౌండర్.. యాక్టింగ్, డాన్స్ ఇలా ఏదైనా సరే చేయగలరు. కెరియర్ ఆరంభంలో ఎన్నో విజయాలు అందుకున్నాడు. కానీ ఎదుటి వ్యక్తులను ఆయన సులభంగా నమ్మేస్తారు. అందువల్లే కెరియర్ లో ఆయనకు ఈ పరిస్థితి ఎదురైంది. పైగా జ్యోతిష్యులు, పండితుల మాటలు ఎక్కువగా వింటాడు. కాబట్టే ఈయన కెరియర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి” అంటూ ఆయన తెలిపారు.