RITES : నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. బీఎస్సీ, ఇంజినీరింగ్ లో డిప్లొమా పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హత, పోస్టులు, వెకెన్సీలు, దరఖాస్తు విధానం, జీతం, వయస్సు తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గుడ్‌గావ్ లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (RITES) కాంట్రాక్ట్ విధానంలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 600 సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 14వ తేదీ నుంచి నవంబర్ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 600
రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్‌లో పలు విభాగాల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. సివిల్, ఎలక్ట్రికల్, ఎస్ అండ్ టీ, మెకానికల్, మెటలర్జీ, కెమికల్, కెమిస్ట్రీ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 600 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాలను బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిప్లొమా(ఇంజినీరింగ్)లో ఉత్తర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు 40 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.29,375 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు ప్రారంభ తేది: అక్టోబర్ 14
దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 12.
ఎగ్జామ్ తేది: నవంబర 23
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష నిర్వహించి ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఎగ్జామ్ సెంటర్స్: ఢిల్లీ, గరుగ్రామ్, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, గువహటి, భువనేశ్వర్, హైదరాబాద్, భిలాయ్, చెన్నై, రాంచీ, అహ్మదాబాద్, పట్నా, లక్నో నగరాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి.
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 600
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 12
ALSO READ: DSSSB: భారీగా టీచర్ ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం, దరఖాస్తుకు ఇంకా ఒక్క రోజే గడువు