BEL Notification: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతన అందజేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హత, పోస్టులు, వెకెన్సీలు, దరఖాస్తు విధానం, జీతం, వయస్సు తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) బెంగళూరు యూనిట్ లో వివిధ విభాగాల్లో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 4న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 162
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ సీ పోస్టులు ఖాళీగా ఉ న్నాయి. అ
వివిధ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఫిట్టర్, ఎలక్రికల్, సివిల్, ఎలక్రానిక్ మెకానిక్ విభాగాల్లో వెకెన్సీలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ: 80 పోస్టులు
టెక్నీషియన్ – సీ: 82 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్, ఐటీఐ, డిప్లొమా పాసై ఉండాలి. ఈ అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
వయస్సు: 2025 అక్టోబర్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 4
వేతనం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి రూ.24,500 – రూ.90,000., టెక్నీషియన్-సీ పోస్టులకు రూ.21,500 – రూ.82,000 జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు రూ.590 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 162
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 4
ALSO READ: CDAC JOBS: బీటెక్ అర్హతతో CDACలో ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే మంచి వేతనం, డోంట్ మిస్ బ్రో