BigTV English

Vande Bharath Staff Fight: ఢిల్లీ రైల్వే స్టేషన్ లో WWE.. చెత్తబుట్టలు, బెల్ట్ లతో కొట్టుకున్న వందే భారత్ సిబ్బంది.. వీడియో వైరల్

Vande Bharath Staff Fight: ఢిల్లీ రైల్వే స్టేషన్ లో WWE.. చెత్తబుట్టలు, బెల్ట్ లతో కొట్టుకున్న వందే భారత్ సిబ్బంది.. వీడియో వైరల్
Advertisement

Vande Bharath Staff Fight: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్న ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సిబ్బంది ఒకరితో ఒకరు ఘర్షణ దిగారు. డస్ట్‌బిన్, బెల్ట్, పిడిగుద్దులతో రెచ్చిపోయారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సిబ్బంది ఘర్షణ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.


రెండు గ్రూపులుగా

శుక్రవారం ఉదయం ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఐఆర్సీటీసీ సిబ్బంది రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు బెల్టులు, డస్ట్ బిన్ లతో దాడి చేసుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌(22470 ) హజ్రత్ నిజాముద్దీన్ నుండి గ్వాలియర్‌కు బయలుదేరే ముందు సిబ్బంది మధ్య ఘర్షణ తలెత్తింది.

హజ్రత్ నిజాముద్దీన్-ఖజురహో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (22470) ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఖజురహోకి బయలుదేరుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు దాదాపు 660 కి.మీ. దూరాన్ని దాదాపు 8 గంటల 20 నిమిషాల్లో చేరుకుంటుంది.


కాంట్రాక్టు రద్దు

సిబ్బంది ఘర్షణపై ఐఆర్సీటీసీ స్పందించింది. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించినట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కోసం సర్వీస్ ప్రొవైడర్‌లోని నలుగురు సిబ్బందిని ఆర్పీఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు సిబ్బంది ఐడీ కార్డులను డీయాక్టివేట్ చేసి, వాటిని డీరోస్టర్ చేశారు. కాంట్రాక్టు రద్దుకు సర్వీస్ ప్రొవైడర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే రూ. 5 లక్షల భారీ జరిమానా విధించినట్లు ఐఆర్సీటీసీ ఎక్స్ వేదికగా తెలిపింది.

ఈ వైరల్ వీడియోలో రైల్వే ప్లాట్‌ఫారమ్ వద్ద ప్రయాణికులు రైలు కోసం వేచిచూస్తుండగా.. ఐఆర్సీటీసీ సిబ్బంది ఘర్షణ పడ్డారు. రైల్వే స్టేషన్‌లోని డిజిటల్ గడియారంలో సమయం ఉదయం 5.49 అని చూపిస్తుంది. వందే భారత్ బయలుదేరే 40 నిమిషాల ముందు రైలు సిబ్బంది చెత్తబుట్టలను విరుసుకుని, పిడిగుద్దులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే ఈ ఘర్షణకు కారణం తెలియాల్సి ఉంది.

Also Read: Spiderman Lizard: రాళ్లపై నివసించే రియల్ స్పైడర్ మ్యాన్.. ఎక్కడుందో తెలుసా?

 

Related News

Spiderman Lizard: రాళ్లపై నివసించే రియల్ స్పైడర్ మ్యాన్.. ఎక్కడుందో తెలుసా?

Viral Video: ఎంఎంటీఎస్ నుంచి లోకల్ రైలు లోకో పైలెట్‌పైకి రాయి విసిరిన మహిళ, వీడియో వైరల్!

Viral News: 27 ఏళ్లుగా కనిపించని కూతురు.. చివరికి దొరికింది వాళ్ల ఇంటి బెడ్ రూమ్‌లోనే, అదెలా?

Viral Video: ట్రైన్‌లో ఓ యువకుడి యవ్వారం.. హిజ్రాకు ఏమిచ్చాడో తెలుసా? షాకైన ప్రయాణికులు.. వీడియో వైరల్

Bougainvillea Tree: నీరు ఎక్కువయితే వాడిపోతుంది.. తక్కువయితే పూస్తుంది! ఈ చెట్టు మిస్టరీ ఏమిటి?

YouTube 1st Month income: నెట్టింట దుమ్మురేపుతున్న భవానీ రామ్, ఫస్ట్ మంత్ సంపాదన ఎంతంటే?

Karwa Chauth: కొత్త పెళ్లి కూతుళ్ల మాస్టర్ ప్లాన్, భర్తల ఇళ్లకే కన్నం వేసిన 12 మంది భార్యామణులు!

Big Stories

×