OTT Movie : రియల్ ఇన్సిడెంట్స్ తో సినిమాలు సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని స్టోరీలు సీట్ ఎడ్జ్ థ్రిల్ తో ప్రేక్షకులను టెన్షన్ లో పెడుతుంటాయి. క్లైమాక్స్ అయిపోతే గాని ఊపిరి మామూలుగా పీల్చుకోగలుగుతారు. అలాంటి థ్రిల్లర్ సినిమా కన్నడ ఇండస్ట్రీ నుంచి, ఈ రోజు నుంచి ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుని, ఐయండిబిలో టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఒక టాక్సీ డ్రైవర్, ఒక రిచ్ అమ్మాయి మధ్య ప్రేమ కథలో వచ్చే కుట్రతో, ఈ సినిమా ఉత్కంఠంగా నడుస్తుంది. ఈ సినిమా 2004లో జరిగిన నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ఎలుమలే’ (Elumale) 2025లో వచ్చిన కన్నడ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. పునీత్ రంగస్వామి దర్శకత్వంలో రాన్నా, ప్రియాంకా అచార్, కిషోర్, జగపతి బాబు, టి.ఎస్. నాగభారణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల అయింది. జీ5లో అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడ భాషలో వచ్చిన ఈ సినిమా తెలుగు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ లో అందుబాటులో ఉంది. అయితే ఇది IMDbలో 9.2/10 టాప్ రేటింగ్ ను పొందింది.
కర్ణాటకలో ఉండే మైసూర్ సిటీలో హరిష్ ఒక టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అతను రేవతి అనే రిచ్ గర్ల్ తో ప్రేమలో ఉంటాడు. అయితే ఒక రోజు తన ప్రేమికురాలు రేవతిని కలవడానికి తమిళనాడులో సాలెం అనే ఆమె సొంత ఊరికి వెళ్తాడు. హరిష్, రేవతి ఒకరినొకరు ఘాడంగా ప్రేమించుకుంటారు. కానీ వాళ్ల ప్రేమ రహస్యంగానే ఉంటుంది. హరిష్ ఆమెను కలవడానికి టాక్సీలో ప్రయాణిస్తున్నప్పుడు, తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఒక భయంకర క్రైమ్ జరుగుతుంది. హరిష్ అనుకోకుండా ఈ సంఘటనలో చిక్కుకుంటాడు. రేవతి కూడా హరిష్‌ను కలవడానికి వచ్చి, ఈ క్రైమ్‌లో ఇరుక్కుంటుంది. ఇద్దరూ కలవాలని ప్లాన్ చేస్తే, ఒక పెద్ద కుట్రలో పడతారు.
Read Also : సదువుకునే అమ్మాయిని తుప్పల్లోకి తీసుకెళ్లి… కట్ చేస్తే పోలీసులే గజగజా వణికే ట్విస్ట్
హరిష్, రేవతి ఈ క్రైమ్ నుంచి బయటపడడానికి ట్రై చేస్తారు. కానీ ఈ క్రైమ్ వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుస్తుంది. సరిహద్దు గ్రామాల్లో కొందరు శక్తివంతమైన వ్యక్తులు దీని వెనుక ఉంటారు. హరిష్, రేవతి ఈ కుట్రను బయటపెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ల లైఫ్ డేంజర్‌లో పడుతుంది. ఈ రాత్రి ప్రయాణంలో భయంకర సంఘటనలు, ప్రమాదాలు ఎదురవుతాయి. వాళ్ల ప్రేమ కథ కూడా ఈ థ్రిల్లర్‌తో కనెక్ట్ అవుతుంది. చివరికి హరిష్, రేవతి ఈ కుట్రను బయటపెడతారా ? ఈ కుట్ర ఏమిటి ? వీళ్ళ ప్రేమ కథకు శుభం కార్డ్ పడుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.