E-Paper
Advertisement

Diploma Courses : ప్రత్యేకమైన విభాగాల్లో డిప్లొమాలు.. వీటికి డిమాండ్..

Diploma Courses : ప్రత్యేకమైన విభాగాల్లో డిప్లొమాలు.. వీటికి డిమాండ్..
Advertisement
Diplamo Courses

Diploma Courses : ప్రస్తుతం ఉన్నత విద్య, ఉద్యోగం, ఉపాధి.. ఈ మూడింటికీ అనువైన పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రత్యేక డిప్లొమాలు ఉన్నాయి. వ్యవసాయం, ఉద్యానవనం కోర్సులు రెండేళ్ల వ్యవధితో తెలుగు మాధ్యమంలో ప్రత్యేక డిప్లొమాలను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. వీటితోపాటు జాతీయ స్థాయిలో డిప్లొమాలు పూర్తి చేసుకోవచ్చు! ఆ కోర్సుల వివరాలేంటో చూద్దాం.

ఉద్యాన డిప్లొమా :
తెలుగు రాష్ట్రాల్లో ఉద్యానవన ఉత్పత్తులు పెరగడంతో అవకాశాలు విస్తరిస్తున్నాయి. పదో తరగతి గ్రేడ్ పాయింట్లు లేదా పరీక్షలో చూపిన ప్రతిభ ప్రకారం రెండేళ్ల ఉద్యాన డిప్లొమాల్లో సీట్లు కేటాయిస్తారు. తెలుగు మాధ్యమంలో బోధన ఉంటుంది. వీరు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చు.

Advertisement

హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ :
ప్రగడ కోటయ్య భారతీయ చేనేత శిక్షణ సంస్థ (వెంకటగిరి) డిప్లొమా ఇన్‌ హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ కోర్సు మూడేళ్ల వ్యవధితో అందిస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు 50 సీట్లు కేటాయిస్తారు. పదో తరగతి గ్రేడ్‌ పాయింట్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

ప్లాస్టిక్‌ డిప్లొమా :
సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) హైదరాబాద్, విజయవాడ క్యాంపస్‌ల్లో మూడేళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌మౌల్డ్‌ టెక్నాలజీ (డీపీఎంటీ), డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌టెక్నాలజీ (డీపీటీ) కోర్సులు అందిస్తున్నారు. ఈ సంస్థ నిర్వహించే పరీక్షతో కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. సీట్లు మిగిలితే నేరుగా పదో తరగతి విద్యార్హతతోనే తీసుకుంటున్నారు. వీటిని పూర్తి చేసుకున్నవారు ప్లాస్టిక్, అనుబంధ పరిశ్రమలు, ప్లాస్టిక్‌ వినియోగ సంస్థల్లో అవకాశాలు పొందవచ్చు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×