AP EAPCET Result-2026: ముందు ప్రకటించిన తేదీకి ఒక్కరోజు ముందుగానే ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 70 శాతంపైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89 శాతానికి పైగానే విద్యార్థులు పాసయ్యారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి లోకేష్.
ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు-2026 విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- AP EAPCET- 2026 ఫలితాలను బుధవారం విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,82,317 మంది ఉత్తీర్ణత సాధించారు. దాదాపు 70.52 శాతం అన్నమాట. ఇక ఇంజినీరింగ్‌లో 71.65 శాతం ఉత్తీర్ణతతో విద్యార్థినులు ముందంజలో నిలిచారు. ఇక అగ్రికల్చర్-ఫార్మసీ విభాగాల్లో 63,546 మంది అర్హత సాధించారు. దాదాపు 89.59 శాతం.
మన మిత్ర వాట్సాప్ 9552300009 ఫలితాలను విద్యార్థులు తెలుసుకోవచ్చు. తొలుత హాయ్ అనే మేసేజ్ చేసి ఎడ్యుకేషన్ సర్వీస్ ను ఎంపిక చేసుకోవాలి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ వివరాలను నమోదు చేసి ఎంటర్ నొక్కాలి. ఆ తర్వాత ఫలితాలు డిస్ ప్లే అవుతాయి, అప్పుడు ర్యాంక్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు
అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి విజయం రాష్ట్ర భవిష్యత్తుకు బలమన్నారు. వెబ్ సైట్ ద్వారా https://cets.apsche.ap.gov.in/EAPCET వివరాలు తెలుసుకోవచ్చు. ఈఏపీసెట్-2026కు ఏపీ వ్యాప్తంగా 3,55,803 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
అందులో 3,29,474 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 92.60 శాతం హాజరు నమోదు అయ్యింది. ఈఏపీసెట్-2026లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మసీ కళాశాలల్లో సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఫలితాలు, ర్యాంకుల విడుదల పూర్తయిన తర్వాత సీట్ల భర్తీ ప్రక్రియ మొదలు కానుంది.
ALSO READ: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్ కౌన్సెలింగ్
అందుకోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి-APSCHE అధికారిక కౌన్సెలింగ్ షెడ్యూల్ తేదీలను ప్రకటించనుంది. విడతల వారీగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయనుంది ప్రభుత్వం.
Warm congratulations to every student who qualified in #APEAPCET2026! 🎉
🔹 Engineering: 1,82,317 qualified (70.52%)
🔹 Agriculture & Pharmacy: 63,546 qualified (89.59%)
Proud that our daughters led the way in Engineering with a 71.65% pass rate! 👏
Your success powers Andhra…— Lokesh Nara (@naralokesh) July 1, 2026