Bank of Baroda Recruitment 2026: ప్రభుత్వ రంగంలో మంచి బ్యాంక్ ఉద్యోగం సాధించాలనుకునే వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 104 ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు ఇదొక అద్భుతమైన అవకాశం. ఆకర్షణీయమైన జీతంతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడాలో కెరీర్ సెట్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, వయోపరిమితి వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీలు, విభాగాల వివరాలు:
మొత్తం 104 ఖాళీలను వివిధ స్పెషలిస్ట్ కేడర్లలో భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రధానంగా క్రెడిట్ అనలిస్ట్, ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఐటీ, ఇతర ప్రొఫెషనల్ విభాగాలు ఉన్నాయి. అభ్యర్థుల నాలెడ్జ్ , ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
అర్హతలు:
విద్యార్హత: పోస్టులను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత డిసిప్లిన్లలో గ్రాడ్యుయేషన్ (డిగ్రీ), బీటెక్, సీఏ (CA), ఎంబీఏ (MBA-Finance), లేదా పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
పని అనుభవం: ఇవి ప్రొఫెషనల్ ఉద్యోగాలు కావడంతో.. సంబంధిత విభాగంలో (బ్యాంకింగ్, ఫైనాన్స్ లేదా ఐటీ రంగంలో) కొన్ని సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ పని అనుభవం తప్పని సరిగా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల కనీస వయస్సు 25 సంవత్సరాల నుంచి గరిష్టంగా 40-45 సంవత్సరాల లోపు ఉండాలి (పోస్టును బట్టి మారుతుంది). ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రొఫెషనల్ పోస్టుల ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా జరుగుతుంది.
షార్ట్‌లిస్టింగ్: అభ్యర్థులు అప్లికేషన్లలో సమర్పించిన విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ముందుగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
పరీక్ష/ఇంటర్వ్యూ: షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆన్‌లైన్ టెస్ట్ (రాత పరీక్ష) లేదా నేరుగా పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. అప్లికేషన్ సంఖ్యను బట్టి బ్యాంక్ తుది నిర్ణయం తీసుకుంటుంది.
జీతం:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపికైన ప్రొఫెషనల్స్‌కు చాలా ఆకర్షణీయమైన పే-స్కేల్ లభిస్తుంది. బేసిక్ శాలరీతో పాటు డీఏ (DA),హెచ్‌ఆర్‌ఏ (HRA),మెడికల్ అలవెన్స్ , లీవ్ ట్రావెల్ కన్సెషన్స్ వంటి ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులకు లభించే అన్ని రకాల ప్రయోజనాలు అందుతాయి. కార్పొరేట్ రంగంతో.. సమానంగా కెరీర్ గ్రోత్ ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి?
అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అఫీషియల్ వెబ్‌సైట్ www.bankofbaroda.in లోని ‘Careers’ సెక్షన్‌కు వెళ్లి ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది.