E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

Hyderabad: విద్యార్థులకు అలర్ట్..  జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్
Advertisement

Hyderabad: తెలంగాణలో విద్యార్థులకు బిగ్ అలర్ట్. జూలై రెండు నుంచి పీజీఈసెట్‌ కౌన్సెలింగ్ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కౌన్సెలింగ్‌కు సంబంధించి అన్ని రకాల సర్టిపికెట్లు రెడీ చేసుకోంది. లేకుంటే కౌన్సెలింగ్ సమయంలో ఇబ్బందులు తప్పవు. నిర్లక్ష్యం చేస్తే ఏడాది అంతా నష్టపోయే అవకాశం ఉంటుంది.

తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

Advertisement

ఎంఈ, ఎంటెక్, ఎం.ఆర్క్, ఎం. ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ పీజీఈసెట్-TG PGECET-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదలైంది. జులై 2 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానుంది. నమోదు ధ్రువీకరణ, ఆన్‌లైన్ చెల్లింపు, సర్టిఫికెట్ల జెరాక్స్‌లు అప్‌లోడ్ చేయడం, ధ్రువపత్రాల పరిశీలన ఉండనుంది.

జులై 13-15 మధ్య తొలి విడుత వెబ్ ఆప్షన్లు ఎంచుకునేందుకు అవకాశం విద్యార్థులు ఉంటుంది. జులై 16న వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉంది. జులై 19న తొలి విడత సీట్ల కేటాయించనున్నారు. కళాశాలల వారీగా ప్రొవిజనల్‌ సెలెక్షన్‌ జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచుతారు సంబంధిత అధికారులు. జులై 20-24 మధ్య కళాశాలల్లో రిపోర్టింగ్‌, ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు.

Advertisement

జులై 2 నుంచి.. విద్యార్థులకు ముఖ్య గమనిక

కౌన్సెలింగ్ కు సమయం దగ్గర పడుతుండడంతో మరోసారి విద్యార్థులను అలర్ట్ చేసింది. కౌన్సెలింగ్ ‌ ప్రక్రియలో పాల్గొనే ముందు సర్టిఫికెట్లను రెడీ చేసుకోవాలి. కుల ధ్రువీకరణ, ఆదాయం, కమ్యూనిటీ, మైగ్రేషన్ సర్టిఫికెట్లు, అలాగే గ్రాడ్యుయేట్ సంబంధిత సబ్జెక్టులకు అన్నిరకాల పత్రాలు మరోసారి చెక్ చేసుకోండి.

వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసే సమయంలో కళాశాలలు, కోర్సుల ఎంపికలో విద్యార్థులు జాగ్రత్త వహించాలని సూచన చేశారు అధికారులు. మరిన్ని వివరాల కోసం https://pgecet.tgche.ac.in/ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.

ALSO READ: టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

Related News

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. మార్క్స్ మెమో లింక్ ఇదిగో!

రేపే.. తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్

టిమ్స్‌లో 122 ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ పూర్తి వివరాలు ఇవే!

సీయూఈటీ-యూజీ ప్రవేశ ఫలితాలు.. జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఎమ్మెల్యే కూతురు దేవినా

విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ 30లోపు ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు!

Big Stories

×