E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!
Advertisement

PJTSAU Admission 2026:  తెలంగాణలో వ్యవసాయ విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) 2026-27 విద్యాసంవత్సరానికి గానూ బీటెక్ అగ్రీ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆధునిక వ్యవసాయ రంగంలో ఇంజనీరింగ్ టెక్నాలజీని ఉపయోగించి అద్భుతాలు సృష్టించాలనుకునే ఎంపీసీ (M.P.C) విద్యార్థులకు ఇదొక సువర్ణావకాశం. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా, అప్లై చేసుకోవడానికి జులై 24 వరకు గడువు ఉంది. ఈ కోర్సు అర్హతలు, ఫీజులు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు..

అర్హత ప్రమాణాలు: ఈ 4 ఇయర్స్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే అభ్యర్థులు క్రింది అర్హతలను కలిగి ఉండాలి.
విద్యార్హత: అభ్యర్థులు తెలంగాణ ఇంటర్ బోర్డు లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఎంపీసీ (M.P.C-Maths, Physics, Chemistry)స్ట్రీమ్‌లో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.

Advertisement

కనీస మార్కులు: ఇంటర్ లో జనరల్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50% మార్కులు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీల వారు కనీసం 45% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

ప్రవేశ పరీక్ష: విద్యార్థులు తప్పనిసరిగా TG EAPCET 2026 (తెలంగాణ ఈఏపీసెట్) ప్రవేశ పరీక్ష రాసి, అందులో అర్హత సాధించి ఉండాలి

Advertisement

ఎంపిక విధానం & కౌన్సెలింగ్ :
బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ సీట్ల భర్తీ పూర్తిగా TG EAPCET 2026 ర్యాంక్ , మెరిట్ ఆధారంగానే జరుగుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత, వారి ర్యాంకులు, రిజర్వేషన్లు, సీట్లను బట్టి కౌన్సెలింగ్ ద్వారా సీట్లను కేటాయిస్తారు. ఇందులో రూరల్/ఫార్మర్ కోటా (రైతు కోటా) కింద వచ్చే విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలవుతాయి.

అప్లికేషన్ ఫీజు & కోర్సు ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు:

జనరల్ , ఇతర కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.1,800 కాగా, ఎస్సీ (SC), ఎస్టీ (ST),దివ్యాంగులకు (PH) రూ.900 గా నిర్ణయించారు. దీనిని ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి.

కోర్సు ఫీజు: ఈ కోర్సుకు సంబంధించి సంవత్సరానికి అంచనాగా రూ.38,800 వరకు అకడమిక్ ఫీజు ఉంటుంది (హాస్టల్, ఇతర ఫీజులు అదనం)

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ: జూలై 24(సాయంత్రం 5:00 గంటల వరకు).

ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి?
అర్హత గల అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్  ద్వారా అప్లై చేసుకోవాలి.

Tags

Related News

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. మార్క్స్ మెమో లింక్ ఇదిగో!

రేపే.. తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్

Big Stories

×