Telanagna Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. తెలంగాణ ఆర్టీసీ లో ఉద్యోగులపై పని భారం ఎక్కువ అవుతోన్న క్రమంలో త్వరలోనే ఉద్యోగాల నియామకాల ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మహాలక్ష్మీ స్కీంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత ఆర్టీసీ డ్రైవర్లు, కండక్లర్లపై పని ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే చాలా రోజుల నుంచి తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలను నింపాలనే డిమాండ్ నెలకొంది. త్వరలోనే.. తెలంగాణ ఆర్టీసీలో 3,038 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్టు సంస్థ వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందని.. త్వరలో ఈ భారీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ పోస్టుల భర్తీ చేపట్టిన అనంతరం కార్మికులు, ఉద్యోగులపై పనిభారం కూడా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీలో వీలైనంతో త్వరలోనే మూడు వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి.. త్వరగానే నియాపక ప్రక్రియ కూడా చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో సాధ్యమైనంత త్వరగా నియామకాలు పూర్తి చేస్తామని అన్నారు. అలాగే కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని.. సంస్థలోని ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఇందులో మొత్తం 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇందులో పలు రకాలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టుల వివరాలు: (గతంలో ప్రకటించిన సమాచారం మేరకు- అఫీషియల్ నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్య గురించి క్లారిటీ రానుంది)
డ్రైవర్ : 2000 పోస్టులు
శ్రామిక్స్: 743 పోస్టులు
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) : 114 పోస్టులు
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) : 84 పోస్టులు
డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ : 25 పోస్టులు
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) : 23 పోస్టులు
అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్: 23 పోస్టులు
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్): 114 పోస్టులు
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) : 84 పోస్టులు
డిపో మేనేజర్ / అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్: 25 పోస్టులు
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) : 23 పోస్టులు
అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్: 15 పోస్టులు
సెక్షన్ ఆఫీసర్ (సివిల్) : 11 పోస్టులు
మెడికల్ ఆఫీసర్ (సివిల్) : 7 పోస్టులు
మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) : 7 పోస్టులు
అకౌంట్స్ ఆఫీసర్ : 6 పోస్టులు
తెలంగాణ ఆర్టీసీ ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 11 రకాల పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ తెలంగాణ ఆర్‌టీసీ సంస్థ విడుదల చేయనుంది. ఇందులో డ్రైవర్ ఉద్యోగాలు, శ్రామిక్ ఉద్యోగాలు ఎక్కువగా ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే పైన పేర్కొన్న పోస్టుల సంఖ్య గతంలో పేర్కొన్న సమాచారం ప్రకారం తెలియజేశారం. ఖచ్చితమైన సమాచారం, పోస్టుల సంఖ్య నోటిఫికేషన్ విడుదలయ్యాక మాత్రమే స్పష్టత రానుంది.
Also Read: Jobs: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ నుంచి భారీ నోటిఫికేషన్.. రూ.74,000 స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం..