Dear Uma Movie Review : తెలుగు చిత్ర పరిశ్రమలో పదహారనాల తెలుగు అమ్మాయిలు కనిపించడం చాలా తక్కువ.. కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నా కూడా సరైన అవకాశాలు లేకపోవడంతో మూవీ ఆఫర్స్ కోసం తెగ కష్ట పడుతున్నారు. అలాంటిది తెలుగు అమ్మాయి అయిన సమయ రెడ్డి మొదటి ప్రయత్నంలోనే హీరోయిన్‌గా, రచయితగా, నిర్మాతగా భిన్న పాత్రల్ని పోషించింది. డియర్ ఉమ అంటూ సుమయ రెడ్డి ఆడియెన్స్ ముందుకు ఏప్రిల్ 18న వచ్చింది. ఇవాళ థియేటర్లలోకి వచ్చేసిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండీ..
కథ :
ప్రాణాలు కాపాడే డాక్టర్ అవ్వాలనేది ఉమా (సుమయ రెడ్డి) కల. అందుకోసం పల్లెటూరు నుంచి చదువుకోవడానికి నగరానికి వస్తుంది. అక్కడ ఆయుష్ మెడికల్ కాలేజిలో జాయిన్ అవుతోంది.
అలాగే దేవ్ (పృథ్వీ అంబర్) అనే కుర్రాడు రాక్ స్టార్ అవ్వాలనే ప్రయత్నం చేస్తాడు. కానీ అతని ప్రయత్నాలు అన్ని ఫెయిల్ అవుతూ వస్తుంటాయి. దాంతో అతని కల నెరవేరదు..చిన్నా చితకా అవకాశంలో గడపగడపకూ తిరుగుతుంటాడు. అలాంటి దేవ్‌కి ఓ సారి ఉమ డైరీ దొరుకుతుంది. తనకు గాయమై హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తన జీవితం మారిందని.. అప్పటి నుంచే ఉమ జీవితం ఆగిపోయిందని తెలుసుకుంటాడు. ఇంతకీ డైరీలో ఉన్న ఉమ ఎవరు? ఏం జరిగింది? ఉమ నేపథ్యం ఏంటి? ఉమ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేస్తుండేది? అనే ప్రశ్నలతో సతమతం అవుతుంటాడు దేవ్. ఇక ఉమ కోసం దేవ్ చేసిన పోరాటం ఏంటి? ఉమతో దేవ్ ప్రేమ ప్రయాణం ఎక్కడి వరకు దారి తీస్తుంది? ఈ కథలో దేవ్ అన్న సూర్య (కమల్ కామరాజ్) పాత్ర ఏంటి? అన్నది సినిమా కథ..
విశ్లేషణ :
యంగ్ డైరెక్టర్ రాజేష్ దర్శకత్వంలో వచ్చిన “డియర్ ఉమ” వైద్య రంగంలోని లోపాలను ఎత్తిచూపుతూ ఒక ముఖ్యమైన చిత్రాన్ని అందించింది. ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గుర్తుచేస్తూ, సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా కథను నడిపించారు. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ముఖ్యంగా వైద్యరంగంలో జరగుతున్న అన్యాయాల నేపథ్యంలో కథను రాసుకుంది. ముఖ్యంగా కరోనా సమయంలో హాస్పిటల్స్ ఏ విధంగా కమర్షియల్ గా ప్రవర్తించాయి. ముఖ్యంగా ఠాగూర్, త్రినేత్రుడు, క్రిమినల్ వంటి సినిమాల లైన్ గుర్తుకు వస్తాయి. సమాజంలో జరిగినా.. గతంలో వచ్చిన సినిమాలను ప్రేరణగా తీసుకొని సుమయ రెడ్డి ఈ కథను రాసుకున్న విధానం బాగుంది.. స్టోరీ ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకుంది. అంతేకాదు చివర్లో ఈ సినిమాలో మంచి సందేశం ఇచ్చారు. అది తెరపై చూడాల్సిందే. వైద్యులకు కనువిప్పు కలిగించారు..
టెక్నీకల్ విషయానికొస్తే.. రాజ్ తోట కెమెరా వర్క్ సహజంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన షాట్స్ మిస్ అయినట్టు అనిపించవచ్చు. స్క్రీన్ ప్లే సినిమాకు ఒక బలంగా నిలిచింది, ముఖ్యంగా ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. అయితే, క్లైమాక్స్‌లోని ఎమోషనల్ సన్నివేశాలు కొందరికి అతిగా అనిపించవచ్చు. పతాక సన్నివేశంలోని పాట సినిమా యొక్క సందేశాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ, కథలో మరింత సహజంగా కలిసిపోయి ఉంటే బాగుండేది. ఇక పోతే ప్రతి సినిమాకు సంగీతం బ్యాక్ బోన్.. ఈ మూవీకిరధన్ సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది.. అయితే కొన్ని చోట్ల మరింత మెరుగ్గా ఉండాల్సింది. మొత్తానికి, “డియర్ ఉమర్” ఒక మంచి ప్రయత్నం, కానీ కొన్ని అంశాలలో మరింత శ్రద్ధ పెడితే ఇది ఒక గొప్ప చిత్రంగా నిలిచేది. తొలి చిత్రమే అయినా సుమ చిత్ర ఆర్ట్స్, నిర్మాత సుమయ రెడ్డి గొప్ప కథను అందించడంలో సక్సెస్ అయ్యారు.. సినిమాకు పాజిటివ్ టాక్ దక్కింది.
నటీనటుల విషయానికొస్తే.. ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరు కూడా వంద శాతం పాత్రలో నటించి జీవించారు అని చెప్పడంలో సందేహం లేదు.. ప్రధాన పాత్రలోనటించిన సుమయ రెడ్డి ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు. మంచి కథను ఇవ్వడమే కాకుండా.. ఈ కథను అనుకున్నట్టుగా తీయడంలో ఖర్చు పెట్టిన నిర్మాతగానూ సుమయ రెడ్డి సక్సెస్ అయింది. సుమయ రెడ్డిలోని రచయిత, నిర్మాతకు వంద మార్కులు వేసుకోవచ్చు.. తెరపై సుమయ రెడ్డి అందంగా కనిపించారు. హీరోగా పృథ్వీ అంబర్ యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించాడు. కమల్ కామరాజ్ పాత్ర సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. అజయ్ ఘోష్ పాత్ర రొటీన్ అనిపిస్తుంది. ఫైమా, లోబో, సప్తగిరి, భద్రం పోషించిన పాత్రలు అక్కడక్కడా నవ్విస్తాయి.
ప్లస్ పాయింట్స్..
స్టోరీ లైన్ బాగుంది..
ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది..
కొన్ని సీన్లు హైలెట్..
మైనస్ పాయింట్స్..
మ్యూజిక్ డల్ అయ్యింది..
కొన్ని చోట్ల స్టోరీ ల్యాగ్ అనిపించింది.
మొత్తంగా… డియర్ ఉమ మెడికల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన లవ్ డ్రామా మూవీ. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే మెప్పిస్తుంది..
Dear Uma Movie Rating : 2.25/5