HCL Recruitment 2024: హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్ ) జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 56 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం ఉద్యోగాల్లో అన్‌రిజర్వ్‌డ్‌కు 26, ఈడబ్ల్యూఎస్‌కు 5, ఓబీసీలకు 15, ఎస్సీలకు 7, ఎస్టీలకు 3 ఉద్యోగాలను కేటాయించారు.
ఖాళీల వివరాలు..
1.మైనింగ్: 46 పోస్టులు
అర్హత: మైనింగ్ డిప్లొమా పూర్తిచేసి సంబంధిత రంగంలో ఐదేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. ఫోర్‌మెన్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ ఉండాలి. లేదా మైనింగ్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండడంతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ఫోర్ మెన్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ లేదా సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ ఉండాలి.
2.ఎలక్ట్రికల్: 06 పోస్టులు
అర్హత: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండడంతో పాటు సంబంధిత రంగంలో ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీ పాసై రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
3.కంపెనీ సెక్రెటరీ: 02 పోస్టులు
అర్హత: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సంబంధిత రంగంలో ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా/ యూకే తుది పరీక్ష ఉత్తీర్ణత పొంది ఉండాలి.
4.ఫైనాన్స్: 01 పోస్టు
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత పొందడంతో పాటు ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. ఇంటర్మీడియట్- ఇన్స్టిట్యూట్ చార్టర్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ పాస్ ఉండడంతో పాటు సంబంధిత రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. లేదా పీజీ డిగ్రీ (ఫైనాన్స్ )/ పీజీ డిప్లొమా( ఫైనాన్స్ )/ఎంబీఏ (ఫైనాన్స్) పాసై రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
5.హెచ్‌ఆర్: 01 పోస్టు
అర్హత: డిగ్రీ పాసై సంబంధిత రంగంలో ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. లేదా పీజీ డిగ్రీ(హెచ్ఆర్ )/పీజీ డిప్లొమా (హెచ్‌ఆర్)/ ఎంబీఏ (హెచ్‌ఆర్) చేసి రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 500. మిగిలిన వారికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
వయో పరిమితి: 01.06.2024 నాటికి 40 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఈడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎక్స్- సర్వీస్‌మెన్ లకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మినహాయింపు ఇస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా ధ్రువపత్రాల పరిశీలన, అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ: 21.07.2024.
Also Read: బ్యాంక్‌లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి
గమనించవలసినవి:
1. అన్ని పోస్టులకు ఒకే రోజు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒకరు ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు.
2. ట్రైనింగ్ /కన్సల్టెన్సీ ఎక్స్ పీరియన్స్/ టీచింగ్ /ఫెలోషిప్స్/ ఇంటర్న్‌షిప్స్/ అప్రెంటిస్ షిప్/ అకడలిక్ ప్రాజెక్ట్‌లను పని అనుభవంగా పరిగణించరు.
3. ధ్రవపత్రాల పరిశీలన, తేదీ, సమయం, వేదికల వివరాలను అభ్యర్థులుకు ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తారు. కాల్ లెటర్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది
4. ఆన్‌లైన్ అప్లికేషన్ కాపీ ఎక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌లను ధ్రువపత్రాల పరిశీలన సమయంలో సమర్పించవలసి ఉంటుంది.
5. ఎంపికైన అభ్యర్థులు కనీసం మూడేళ్ల పాటు పని చేయాలి.