BigTV English

Indian Coast Guard Recruitment 2024: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు.. 320 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Indian Coast Guard Recruitment 2024: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు.. 320 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Indian Coast Guard Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ కోస్ట్ గార్డ్ 320 నావిక్, యాంత్రిక్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారత తీర రక్షక దళంలో పని చేయడానికి ఆసక్తి ఉన్న పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.


పోస్టుల వివరాలు:
1.నావిక్: 260 పోస్టులు
2.యాంత్రిక్: 60 పోస్టులు
విద్యార్హతలు :
నావిక్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. యాంత్రిక్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు టెన్త్, ఇంటర్ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల కనీస వయస్సు 18 – 22 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 2003 మార్చి 1 నుంచి 2007 ఫిబ్రవరి 28 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు వయోపరిమితిపై సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Also Read: భారత్ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..అర్హతలు ఇవే!


ఎంపిక విధానం: ముందుగా అభ్యర్థులకు స్టేజ్ -1, స్టేజ్ -2 , స్టేజ్ -3, స్టే-4 పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత వీటిలో ఉత్తీర్ణులైన వారికి శారీరక దారుఢ్య పరీక్షలు, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం అర్హులైన అభ్యర్థులను నావిక్, యాంత్రిక్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 3, 2024

Tags

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×