IT Jobs: రెసిషన్ ఉందా? అంటే లేదు అని వెంటనే ఆన్సర్ చెప్పలేరు. అలాగని ఉందని కూడా అనలేరు. అట్లుంది మరి పరిస్థితి. ఐటీ సెక్టార్ మిక్స్‌డ్‌గా కనిపిస్తోంది. ఓపెనింగ్స్ లేవు. బీటెక్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్‌కు జాబ్స్ వస్తున్నాయనే టాక్ లేదు. క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతున్నాయనే న్యూస్ కూడా లేదు. అంతా డ్రై డ్రై గా ఉంది. ఐటీకి ఏదో అయినట్టుంది. ఇది ట్రంప్ దెబ్బా? డిమాండ్ కొరతా? కాస్ట్ కటింగ్సా? ఏమో…
హమ్మయ్యా.. మాకు జాబ్ వచ్చేసింది. మేము ఇక సేఫ్ అనుకునేరు. అంత సీన్ లేదంటున్నాయి ఐటీ కంపెనీలు. ట్రైనీలుగా తీసుకున్నా.. పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే జాబ్ ఊస్ట్ చేస్తున్నాయి. ఏదో ఒకరు ఇద్దరు కాదు.. ఇలా ఏకంగా 400 మంది ట్రైనీలను ఉద్యోగాల నుంచి రిమూవ్ చేసింది ఇన్ఫోసిస్. మైసూర్ క్యాంపస్‌లో పింక్ బాంబ్ పేల్చింది.
ఇన్ఫోసిస్‌పై PMOకు కంప్లైంట్
సెలెక్ట్ అయిన వారికి కొన్ని నెలలు ట్రైనింగ్ ఇచ్చింది ఇన్ఫీ. ఆ తర్వాత ఫైనల్ అసెస్‌మెంట్ నిర్వహించింది. అందులో చాలామంది దారుణంగా పర్ఫార్మ్ చేశారట. స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో అర్హత సాధించలేదంటూ.. అప్రెంటిస్‌షిప్‌కు కంటిన్యూ చేయకుండా.. వారిని ఇంటికి పంపించేస్తున్నట్టు ఆయా ట్రైనీస్‌కు మెయిల్స్ పెట్టింది కంపెనీ. అయితే, చివరాఖరుకు చిన్న ఛాన్స్ ఇచ్చింది. లేఆఫ్ అయిన వారందరికీ కావాలంటే వేరే డొమైన్‌లో ట్రైనింగ్ ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సెక్టార్‌లో 3 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారట. అందులోనైనా మంచి పనితీరు ప్రదర్శించి, సెలెక్ట్ అయితే ఇన్ఫోసిస్ BPM లిమిటెడ్‌లో రిక్రూట్ చేసుకోనుంది. అయితే, ఏవో కారణాలు చెప్పి ఇలా వందలాది మంది ట్రైనీస్‌ను రోడ్డున పడేస్తోందంటూ బాధితులు ప్రధానమంత్రి కార్యాలయానికి సైతం కంప్లైంట్ చేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్.
కరోనా బ్యాచ్ ఎఫెక్టేనా?
ఇంతకీ అసలు ఏం జరుగుతోంది? తప్పు కంపెనీదా? స్టూడెంట్స్‌దా? ప్లేస్‌మెంట్స్ లేకున్నా ఇన్ఫీ రిక్రూట్ చేసుకుంటోందా? నిజంగానే కంపెనీ స్టాండర్డ్స్‌ను ట్రైనీస్ రీచ్ కాలేకపోతున్నారా? అనే చర్చ కూడా నడుస్తోంది. కరోనా కాలంలో విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోయాయనేది కాదనలేని వాస్తవం. ఆ టైమ్‌లో కాలేజీలు చదువు చెప్పింది లేదు.. స్టూడెంట్స్ చదువు నేర్చుకుంది లేదు. ఏదో ఎగ్జామ్స్ పెట్టామా.. పాస్ అయ్యామా.. అన్నట్టు సాగింది తంతు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌ను మన విద్యార్థులు అందుకోలేక పోతున్నారని.. చాలామందిలో సరైన బేసిక్స్ కూడా ఉండటం లేదని ఐడీ ఇండస్ట్రీ గగ్గోలు పెడుతోంది. ఈ ఆరోపణ ఎప్పటినుంచో ఉన్నా.. కరోనా తర్వాత మరీ ఎక్కువైంది. ఇంతకుముందైతే జాబ్‌లో జాయిన్ అయ్యాక.. నానా తంటాలు పడి.. ఓ ఏడాదిలోనో, రెండేళ్లలోనో రాటు దేలేవారు ఎంప్లాయిస్. ఇప్పుడలా కాదు. ట్రైనింగ్‌లోనే చేతులెత్తేస్తున్న వారి సంఖ్య ఎక్కువే ఉంది. అందుకు ఎగ్జాంపులే ఇన్ఫోసిస్‌లో 400 మంది ట్రైనీస్‌ను తీసేయడం. మరి, ఈ ప్రాబ్లమ్ ఒక్క ఇన్ఫీలోనే ఉందా? మిగతా ఐటీ కంపెనీలూ ఇక మొదలుపెడతాయా? ఇప్పటికే అమెరికా వీసాలు టైట్ చేసింది.. అక్కడా ఉద్యోగాల పరిస్థితి బాలేదు. ఇండియాలోనూ కోతలు మొదలైతే..? చూడాలి పరిస్థితులు ఎలా ఉంటాయో.