E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

నీట్ రీ-టెస్ట్‌లో ఆసక్తికర విషయాలు.. మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లు, 24 మంది అరెస్ట్

నీట్ రీ-టెస్ట్‌లో ఆసక్తికర విషయాలు.. మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లు, 24 మంది అరెస్ట్
Advertisement

NEET Re-Test: కేంద్రానికి నీట్ రీ టెస్ట్‌ ఎగ్జామ్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోందా? ఆదివారం జరిగిన రీ టెస్టులో ఏం జరిగింది? మున్నాబాయ్ ఎంబీబీఎస్ లు తయారయ్యారా? దీని వెనుక ఓ గ్యాంగ్ ప్రమేయముందా? ఇప్పటివరకు మెడికల్ విద్యార్థులతోపాటు 24 మందిని అరెస్టు చేశారా? మరి ఎగ్జామ్ మాటేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

నీట్ రీ-టెస్ట్‌లో బండారం బట్టబయలు

Advertisement

దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ రీ ఎగ్జామ్ గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆదివారం జరిగిన పరీక్షకు దాదాపు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే నీట్ రీటెస్ట్‌లో అక్రమాలకు తెరలేపిన ఓ పెద్ద ముఠా గుట్టును రట్టు చేశారు బీహార్ పోలీసులు.

విద్యార్థులు బదులుగా పరీక్షలు రాసేందుకు ఇతరులను రంగంలోకి దించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్టయినవారిలో మెడికల్ కాలేజీలకు చెందిన ఎంబీబీఎస్, నర్సింగ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంపెనీ ఉద్యోగులు ఉండటం మళ్లీ కలకలం రేపింది. దీనివెనుక గయాకు చెందిన ఏఎన్ఎం మెడికల్ కాలేజీ విద్యార్థి కీలక సూత్రధారిగా భావిస్తున్నారు.

Advertisement

బీహార్‌లో 24 మంది అరెస్ట్.. మెడికల్ విద్యార్థులతోపాటు నర్సింగ్ వాళ్లు కూడా

లఖిసరాయ్ జిల్లాలో వివిధ పరీక్ష కేంద్రాల్లో జరిగిన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేఆర్‌కే హైస్కూల్ పరీక్ష కేంద్రం, హసన్‌పూర్ స్కూల్‌ నుంచి ఒకొక్కరు, కేంద్రీయ విద్యాలయం నుంచి ఏడుగురు నకిలీగా పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. పట్టబడినవారంతా విద్యార్థుల స్థానంలో పరీక్షకు హాజరైనట్లు తేలింది.

మొత్తం  21 మందిని అరెస్టు చేశారు. వీరి పాత్రపై అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. రానున్న రోజుల్లో అరెస్టుల సంఖ్య పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అర్పిత్‌రాజ్‌ అనే వ్యక్తి 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ విచారించింది. పాట్నా మెడికల్ కాలేజ్‌లో మూడో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న మయాంక్ కశ్యప్‌ని అరెస్ట్ చేశారు.

ఓ బయోమెట్రిక్ కంపెనీకి చెందిన 14 మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ఇన్సైడర్స్ సాయంతో విద్యార్థుల స్థానంలో చదువుకున్న మెడికల్ స్టూడెంట్స్ కూర్చోబెట్టి ఎగ్జామ్ మేనేజ్ చేయడమే ఈ గ్యాంగ్ ప్లాన్ గా చెబుతున్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీ నర్సింగ్ విద్యార్థిని మరొకరి స్థానంలో పరీక్ష రాస్తూ అడ్డంగా బుక్కయ్యారు.

ALSO READ: సీబీఎస్ఈ 12వ తరగతి.. రీ-వాల్యుయేషన్ ఫలితాలు, 87 శాతం

ఎయిమ్స్ రాయ్‌బరేలీ విద్యార్థి సౌరభ్ ఝా, ఢిల్లీలోని షాదరా మెడికల్ కాలేజీ ఇంటర్న్ అమన్ అగర్వాల్, నలంద మెడికల్ కాలేజీ నర్సింగ్ విద్యార్థి సంజీత్, అతని సోదరుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నీట్ పరీక్షల సమయంలో మెడికల్ విద్యార్థులు క్యాంపస్ వదిలి వెళ్లకూడదని ఆదేశాలు ఉన్నాయి.

వారిపై నిఘా పెట్టేందుకు కాలేజీలు సెమినార్లు నిర్వహించారు. అనారోగ్యం నెపంతో మయాంక్ కశ్యప్ లాంటి విద్యార్థులు తప్పించుకుని ఈ దందాకు పాల్పడ్డారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్నవారి కోసం వేట సాగిస్తున్నారు బీహార్ పోలీసులు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 నుంచి రూ.40 లక్షలు వసూలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

Related News

విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ 30లోపు ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 538 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

సీబీఎస్ఈ 12వ తరగతి.. రీ-వాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఏపీ వైద్య శాఖలో..529 స్టాఫ్ నర్స్,ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివిగో !

దేశవ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్.. సెంటర్లలో పటిష్ట బందోబస్తు, ప్రశ్నాపత్రాలు విమానాల్లో తరలింపు

పాలిటెక్నిక్ విద్యార్థులకు అలర్ట్.. ఏపీ పాలీసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

Big Stories

×