E-Paper
Advertisement

ముంబైలో వైరస్‌ల అటాక్.. కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణం ఇదే!

ముంబైలో వైరస్‌ల అటాక్.. కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణం ఇదే!
Advertisement

Mumbai Covid Cases : ముంబైలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రుతుపవనాలు ఆలస్యం కావడం, పెరిగిన ఉక్కపోత (హ్యుమిడిటీ) కారణంగా నగరంలో వైరల్ ఇన్ఫెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కోవిడ్-19 కేసులు మళ్లీ మెల్లగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్‌తో పాటు H1N1 (స్వైన్ ఫ్లూ), ఇన్‌ఫ్లుఎంజా-A, ఆర్‌ఎస్‌వి (RSV) వంటి శ్వాసకోశ వైరస్‌లు ఒకేసారి దాడి చేస్తున్నాయని, హాస్పిటల్స్‌కు వచ్చే పేషెంట్ల సంఖ్య పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు.

ముంబైలో వైరస్‌ల కలకలం:

ముంబైలో వర్షాలు పడకముందే వైరల్ ఫీవర్స్ ఊపందుకున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, ఈసారి ఎండలు-ఉక్కపోత ఎక్కువగా ఉండటం వల్లే ముందే వచ్చేసాయంటున్నారు మెడికల్ ఎక్స్‌పర్ట్స్. గత కొన్ని వారాలుగా స్వైన్ ఫ్లూ (H1N1) కేసులతో సతమతమవుతున్న ముంబైకర్లకు, ఇప్పుడు సైలెంట్‌గా కోవిడ్-19 కూడా ఎంట్రీ ఇవ్వడం టెన్షన్ పెడుతోంది.

Advertisement

హాస్పిటల్స్‌లో పెరుగుతున్న రద్దీ:
ముంబైలోని ప్రముఖ బ్రీచ్ క్యాండీ, బాంబే హాస్పిటల్, భటియా హాస్పిటల్స్ లలో రోజువారీ ఓపీడీల్లో వైరల్ ఇన్ఫెక్షన్ల కేసులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ పాథాలజిస్ట్ మాట్లాడుతూ.. తమ ల్యాబ్‌లో ప్రతిరోజూ కనీసం 7 కంటే ఎక్కువ కోవిడ్ లేదా H1N1 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. అలాగే గత వారం రోజులుగా కోవిడ్ పేషెంట్లు హాస్పిటల్స్‌లో అడ్మిట్ అవ్వడం కూడా స్టార్ట్ అయిందని సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ హేమంత్ ఠాకర్ పేర్కొన్నారు.

గాల్లో తేమ :
ప్రస్తుతం ముంబైలో వర్షాలు పడకుండా, గాల్లో హ్యుమిడిటీ (తేమ) లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. బాంబే హాస్పిటల్ ఫిజీషియన్ డాక్టర్ గౌతమ్ భన్సాలీ ప్రకారం.. “ఈ విపరీతమైన ఉక్కపోత వాతావరణం వైరస్‌లు ఈజీగా వ్యాపించడానికి హెల్ప్ అవుతోంది. ప్రస్తుతం కోవిడ్‌తో పాటు ఇన్‌ఫ్లుఎంజా-A, ఆర్‌ఎస్‌వి (RSV) వైరస్‌లు కూడా గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటివల్ల పేషెంట్లకు హై-ఫీవర్, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి.

Advertisement

Also Read: ఫుడ్ సేఫ్టీ రేసులో దుమ్ములేపిన బిర్యానీ సెంటర్‌.. కానీ ఈ చిన్న పొరపాట్లు లేకపోతే!

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
బీఎంసీ (BMC) ఎగ్జిక్యూటివ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దక్షా షా మాట్లాడుతూ.. ప్రస్తుతానికి కోవిడ్ కేసులు పరిమితంగానే ఉన్నాయని, ఇవన్నీ వాతావరణ మార్పుల వల్లే వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతానికి కోవిడ్ లక్షణాలు మైల్డ్ (సాధారణంగా) ఉన్నప్పటికీ..వృద్ధులు ,బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు , చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎందుకంటే కోవిడ్ లాంటి వైరస్‌లు ఊపిరితిత్తుల కణజాలాన్ని బలహీనపరుస్తాయి.

వర్షాలు పడితే తగ్గుతాయా?
గాల్లో తేలుతున్న ఈ వైరస్‌లన్నీ రుతుపవనాలు లేకపోవడం వల్లేనని, ఒక్కసారి ముంబైలో భారీ వర్షాలు పడి వాతావరణం చల్లబడితే.. ఈ ఇన్ఫెక్షన్ల జోరు తగ్గుతుందని డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అప్పటివరకు జ్వరం, దగ్గు, అలసట ఉంటే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

Related News

చూయింగ్ గమ్ నమిలితే క్యాన్సర్ తగ్గుతుందా? అధ్యయనంలో షాకింగ్ ఫలితాలు

కిచెన్‌లో ఈ చిన్న తప్పులే.. నెలాఖరుకి పర్సు ఖాళీ చేస్తాయి!

వర్షాల్లో పిల్లలను స్కూల్‌కు పంపుతున్నారా?.. ఈ జాగ్రత్తలు అస్సలు మర్చిపోవద్దు!

ఫోన్‌లో సీక్రెట్లు ఉంటేనే గొడవలు.. భార్యాభర్తలు ఇది తెలుసుకోవాలి!

మీ గర్ల్‌ఫ్రెండ్ ఇగోతో విసిగిపోయారా.. ఈ 5 ట్రిక్స్‌తో మీ మన:శాంతి కాపాడుకోండి

లేడీ లక్.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను భర్త ఎంతో గారబంగా చూసుకుంటారు

రాత్రి హైవేపై డ్రైవింగ్ చేసేటప్పుడు హై బీమ్ లైట్లతో ఇబ్బందిపడున్నారా? సురక్షితంగా డ్రైవ్ చేసేందుకు టిప్స్

ధృడమైన చేతులు, భుజాలు కావాలా? అప్పర్ బాడీ బలం పెంచుకోవడానికి ఈజీ డంబెల్ వ్యాయామాలు

Big Stories

Advertisement
×