E-Paper
Advertisement

ఒకే ఒక్క గ్యాడ్జెట్.. నాలుగు అద్భుతాలు.. బుర్ర బద్దలయ్యే డివైజ్ భయ్యా!

ఒకే ఒక్క గ్యాడ్జెట్.. నాలుగు అద్భుతాలు.. బుర్ర బద్దలయ్యే డివైజ్ భయ్యా!
Advertisement

Tempt Privee Fusion: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఒకే గ్యాడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు ఉండాలని యూజర్లు కోరుకుంటున్నారు. టేబుల్‌పై రకరకాల డివైజ్‌లు పెట్టి స్థలాన్ని వృథా చేయడం కంటే.. అన్ని పనులూ ఒకే దాంతో అయిపోతే ఎంతో బాగుంటుందని భావిస్తున్నారు. అలాంటి వారికి ‘టెంప్ట్ ప్రివీ ఫ్యూజన్’ (Tempt Privee Fusion) గ్యాడ్జెట్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. కేవలం రూ. 2,699 ధరలో లభించే ఈ మల్టీ-ఫంక్షనల్ గ్యాడ్జెట్.. ప్రస్తుతం టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఇందులో ఏముంది? దీన్ని ఎందుకు కొనాలో ఇప్పుడు చూద్దాం.

ఒక్క గ్యాడ్జెట్.. ఎన్నో లాభాలు

టెంప్ట్ ప్రివీ ఫ్యూజన్.. ఆల్ రౌండర్ గ్యాడ్జెట్ అని చెప్పవచ్చు. ఇది బ్లూటూత్ స్పీకర్‌గా, రేడియోగా, అలాగే ఉదయాన్నే మిమ్మల్ని నిద్రలేపే అలారం క్లాక్‌గా కూడా పనిచేస్తుంది. బెడ్‌రూమ్ టేబుల్‌, ఆఫీస్ డెస్క్‌పై పెట్టుకోవడానికి ఇది పర్ఫెక్ట్ డిజైన్‌తో వచ్చింది. సమయాన్ని స్పష్టంగా చూపించే పెద్ద డిస్‌ప్లే దీని ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు.

అదిరిపోయే సౌండ్.. అలరించే రేడియో

Advertisement

ఫోన్ లోని బ్లూటూత్ ద్వారా ఈ డివైజ్ కు చాలా ఫాస్ట్ గా కనెక్ట్ కావొచ్చు. మీకు నచ్చిన పాటలను మంచి బేస్, స్పష్టమైన సౌండ్‌తో ఆస్వాదించవచ్చు. పాటలతో పాటు వార్తలు, ఇతర కార్యక్రమాలు వినాలనుకునే వారి కోసం ఇందులో ఎఫ్ఎమ్ (FM) రేడియో సదుపాయం కూడా ఉంది. పాత రోజులను గుర్తుచేస్తూ రేడియో వినడం ఇందులో ఒక మంచి అనుభూతిని ఇస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

వైర్‌లెస్ ఛార్జింగ్

ఈ గ్యాడ్జెట్‌లో స్పీకర్, రేడియో, అలారం క్లాక్ తో పాటు మరో ప్రత్యేకత దాగుంది. ఇది ‘వైర్‌లెస్ ఛార్జింగ్’ ఫీచర్ ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తే, కేవలం ఈ డివైజ్ పైన ఫోన్ ఉంచితే చాలు అది వైర్‌లెస్ పద్ధతిలో ఛార్జ్ అయిపోతుంది. రాత్రి పూట అలారం పెట్టుకుని, ఫోన్‌ను దీనిపై పెడితే ఉదయానికల్లా ఫోన్ ఫుల్ ఛార్జింగ్‌తో సిద్ధంగా ఉంటుంది. కేబుల్స్ తిప్పలు లేకుండా ఫోన్ ఛార్జ్ చేసుకోవడం దీంతో చాలా తేలిక కానుంది.

Advertisement

Also Read: సీలింగ్ vs పెడెస్టల్ ఫ్యాన్.. కూలింగ్ ‘కింగ్’ ఎవరు? అసలు నిజం ఇదీ!

ఇంతకీ కొనడం వర్త్ ఏనా?

రూ. 2,699 బడ్జెట్‌లో ఒక మంచి బ్లూటూత్ స్పీకర్, అలారం క్లాక్, రేడియోతో పాటు ప్రీమియం వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా లభిస్తుండటం నిజంగా సూపర్ డీల్ అని నిపుణులు అంటున్నారు. మీ డెస్క్‌ పై ఎక్కువ గ్యాడ్జెట్ల అవసరం లేకుండా ఈ ఆల్ రౌండర్ డివైజ్ మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుందని పేర్కొంటున్నారు. కాబట్టి మల్టీ టాస్కింగ్ గ్యాడ్జెట్ కావాలనుకునే వారికి ‘టెంప్ట్ ప్రివీ ఫ్యూజన్’ ఒక బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు వివరిస్తున్నారు.

Also Read: అరాచకం సామీ.. థర్మాకోల్ గోడలతో ఇల్లు.. ఇక లైఫ్ లాంగ్ కూలింగ్ ఫ్రీ!

Related News

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

ఏఐ మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీ..గూగుల్,ఆపిల్ ఫోన్లలోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు!

Big Stories

Advertisement
×