E-Paper
Advertisement

Pune Crime: పూణే బిజినెస్ మ్యాన్ హత్యకేసులో సంచలనం.. వెలుగులోకి మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు!

Pune Crime: పూణే బిజినెస్ మ్యాన్ హత్యకేసులో సంచలనం.. వెలుగులోకి మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు!
Advertisement

Pune Crime: పుణెకు చెందిన 26 ఏళ్ల కేతన్‌ అగర్వాల్‌ పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్‌ మ్యాన్. జీవితంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న కేతన్‌కు ఇటీవలే ఒక యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఇరు కుటుంబాలు ఎంతో సంతోషంగా నవంబరులో ఉదయ్‌పుర్‌లోని ఒక లగ్జరీ ప్యాలెస్‌లో గ్రాండ్‌గా పెళ్లి చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. జూన్‌ 19న కాబోయే భార్య పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాడు కేతన్. జూన్ 18న తన కాబోయే భార్యను, కొందరు ఫ్రెండ్స్‌ను తీసుకుని చారిత్రక లోహగఢ్‌ కోటకు వెళ్లాడు. అక్కడే సీన్ రివర్స్ అయింది. కోట పైనుంచి దాదాపు 400 అడుగుల లోతు లోయలో పడి కేతన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

సీన్ కట్ చేస్తే..

కేతన్ చనిపోగానే కాబోయే భార్య పోలీసుల ముందు ఒక కట్టుకథ అల్లింది. “మేమంతా ట్రెక్కింగ్‌కు వచ్చాం కేతన్ నన్ను ఫొటోలు తీస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా పెద్ద గాలి వీచడంతో బ్యాలెన్స్ తప్పి లోయలో పడిపోయాడు” అంటూ ఏడ్చింది. మొదట పోలీసులు కూడా దీన్ని ప్రమాదంగానే భావించారు. కానీ, సీన్ కట్ చేస్తే.. విచారణ సమయంలో ఆ యువతి ప్రవర్తనపై పోలీసులకు గట్టి అనుమానం వచ్చింది. ఆమె మాటల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో నిలదీశారు. అంతే.. అసలు నిజం కక్కేసింది.

Advertisement

Also read: TMC Revolt: 28 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఘోర పరాభవం.. మమతకు ఊహించని దెబ్బ..!

పక్కా ప్లాన్ ప్రకారం..

అది ప్రమాదం కాదు పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్య. తన ప్రియుడితో కలిసి జీవించడానికే కాబోయే భార్య ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి కేతన్‌ను కొండపై నుంచి నెట్టేసి చంపేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం కేతన్ కు కాబోయే భార్య, ఆమెకు సహకరించిన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నమ్మి వెళ్లిన వ్యక్తే నట్టేట ముంచాడంటే ఇదేనేమో! పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుణ్ణి.. కాబోయే వధువే కాటికి పంపిన ఈ ఘటన ఇప్పుడు పుణెలో తీవ్ర కలకలం రేపుతోంది.

Advertisement

Also read; కిష‌న్‌రెడ్డి.. ఆట‌లో అర‌టిపండు! ఇగ న‌న్ను తిట్ట‌వు గ‌దా! నేనూ తెలంగాణ కోస‌మే ఆలోచిస్తున్నా తెలుసా!?

Related News

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

ఆస్తులు పెంచుకోలే.. ప్రజల మనసుల్లో అంతస్తులు కట్టుకున్నారు! ఆ ముగ్గురి కామ్రేడ్‌ల నిస్వార్థ ప్రజాసేవ ప్రస్థానం..!

Big Stories

Advertisement
×