E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పాలిటెక్నిక్ విద్యార్థులకు అలర్ట్.. ఏపీ పాలీసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

పాలిటెక్నిక్ విద్యార్థులకు అలర్ట్.. ఏపీ పాలీసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Advertisement

AP POLYCET 2026 Counseling: ఏపీలో పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఏపీ పాలీసెట్ (AP POLYCET 2026)ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. జూన్ 24 నుంచి ఈ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ సీట్ల కేటాయింపు కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ , వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలీసెట్ 2026 కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్:
ఆన్‌లైన్ ద్వారా జరిగే ఈ అడ్మిషన్ల ప్రాసెస్ వివిధ దశల్లో సాగుతుంది. ముఖ్యమైన తేదీల వివరాలు..

Advertisement

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు & రిజిస్ట్రేషన్: జూన్ 24 నుంచి అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

సర్టిఫికేట్ వెరిఫికేషన్: ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికి నిర్దేశిత హెల్ప్ లైన్ సెంటర్లలో (HLC) ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుంది.

Advertisement

వెబ్ ఆప్షన్ల నమోదు: సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలు, బ్రాంచ్‌లను (మెకానికల్, సివిల్, ఈసీఈ, సీఎస్ఈ మొదలైనవి) వెబ్ ఆప్షన్ల ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి.

సీట్ల కేటాయింపు : విద్యార్థులు పెట్టుకున్న ఆప్షన్లు, వారి పాలీసెట్ ర్యాంక్, రిజర్వేషన్ ఆధారంగా మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.

వెరిఫికేషన్‌కు కావాల్సిన ముఖ్యమైన సర్టిఫికేట్లు:
కౌన్సెలింగ్‌కు వెళ్లే ముందే.. విద్యార్థులు ఈ కింది డాక్యుమెంట్లను రెడీ చేసి పెట్టుకోవడం మంచిది.

ఏపీ పాలీసెట్ 2026 హాల్ టికెట్

పాలీసెట్ 2026 ర్యాంక్ కార్డ్

ఎస్ఎస్సీ మార్క్స్ మెమో లేదా తత్సమాన సర్టిఫికేట్

4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు

ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (వర్తించే వారికి మాత్రమే)

బదిలీ సర్టిఫికేట్

క్యాస్ట్ సర్టిఫికెట్

ఇన్ కమ్ సర్టిఫికెట్ లేదా రేషన్ కార్డ్

లోకల్/నాన్-లోకల్ స్టేటస్ సర్టిఫికేట్

వెబ్ ఆప్షన్ల సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
పాలీసెట్‌లో మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ.. వెబ్ ఆప్షన్లు సరిగ్గా పెట్టుకోకపోతే నచ్చిన కాలేజీలో సీటు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే.. కేవలం ఒకటి రెండు ఆప్షన్లతో ఆగిపోకుండా.. ఎక్కువ సంఖ్యలో కాలేజీలను ఆర్డర్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు, టాప్ రేటింగ్ ఉన్న ప్రైవేట్ కాలేజీలను ఎంచుకోవడం సేఫ్ ఆప్షన్. మరిన్ని  అప్‌డేట్స్ ,ఆన్‌లైన్ ఫీజు పేమెంట్ కొరకు విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ appolycet.nic.in ని సందర్శించవచ్చు.

Related News

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే ఛాన్స్

గుడ్ న్యూస్.. 86 లెక్చరర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్

ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్.. 1,500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు.. 78 వేల మంది ఉత్తీర్ణత

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు లైన్‌ క్లియర్‌.. సుప్రీంకోర్టు నిరాకరణ, జూన్‌ 21న పరీక్ష యథాతథం

ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు.. ఫస్టియర్ విద్యార్థులదే హవా

తెలంగాణలో శుక్రవారం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్..15 వేల సీట్లు పెంపు, అందరి చూపు సీఈసీపైనే

Big Stories

×