E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ 30లోపు ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు!

విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ 30లోపు ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు!
Advertisement

AP EAPCET Results 2026:ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరాలని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న లక్షలాది మంది విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని అందరూ వెయిట్ చేస్తున్న ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2026) ఫలితాలు జూన్ 30 లోగా విడుదల కానున్నాయి. వాస్తవానికి ఈ ఫలితాలు జూన్ 1 నాటికే రావాల్సి ఉన్నప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ , సీబీఎస్ఈ ఫలితాల వెరిఫికేషన్ కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఫలితాల ఆలస్యానికి అసలు కారణం ఇదే!
ఏపీ ఈఏపీసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. దీనివల్ల ఇంటర్ మార్కులు చాలా కీలకం. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల మార్కుల మెరుగుదలకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ (ఇంప్రూవ్‌మెంట్) పరీక్షలు రాసే ఛాన్స్ ఇచ్చింది. దాంతో పాటు దాదాపు 8 వేల మంది సీబీఎస్ఈ (CBSE) విద్యార్థులు కూడా ఈసారి ఎప్సెట్ పరీక్ష రాశారు. ఈ సీబీఎస్ఈ 12వ తరగతి రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ ఫలితాలను జూన్ 21న బోర్డు 85 శాతం వరకు ప్రకటించింది. మిగిలిన దరఖాస్తుల ఫలితాలు కూడా త్వరలోనే రానున్నాయి. ఈ పూర్తి డేటా అందిన వెంటనే ఎప్సెట్ రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు.

Advertisement

మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు:
ఏ ఒక్క విద్యార్థికి కూడా ర్యాంకుల కేటాయింపులో అన్యాయం జరగకూడదన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.ఈ నేపథ్యంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. “ఎప్సెట్ ఫలితాలు వారం రోజులు ఆలస్యమైనా ఫర్వాలేదు కానీ, ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగడానికి వీల్లేదు” అని అధికారులను ఆదేశించారు. దీంతో విద్యార్థులందరి మార్కులను పక్కాగా క్రోడీకరించి, ఈ నెలాఖరుకు (జూన్ 30 లోగా) పక్కాగా రిజల్ట్స్ ఇచ్చేందుకు ఎప్సెట్ చైర్మన్, జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.

అప్లికేషన్ ..కౌన్సెలింగ్ ఫీజు:
ఈ ఏడాది మే 12 నుంచి 20 వరకు జరిగిన ఈ ఎప్సెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం వెబ్ కౌన్సెలింగ్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు సాధారణంగా ఓసీ/బీసీ (OC/BC) విద్యార్థులకు రూ.1200 వరకు, ఎస్సీ/ఎస్టీ (SC/ST) విద్యార్థులకు రూ. 600 వరకు ఉండే అవకాశం ఉంది.

Related News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 538 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

నీట్ రీ-టెస్ట్‌లో ఆసక్తికర విషయాలు.. మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లు, 24 మంది అరెస్ట్

సీబీఎస్ఈ 12వ తరగతి.. రీ-వాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఏపీ వైద్య శాఖలో..529 స్టాఫ్ నర్స్,ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివిగో !

దేశవ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్.. సెంటర్లలో పటిష్ట బందోబస్తు, ప్రశ్నాపత్రాలు విమానాల్లో తరలింపు

పాలిటెక్నిక్ విద్యార్థులకు అలర్ట్.. ఏపీ పాలీసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

Big Stories

×