E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

దేశవ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్.. సెంటర్లలో పటిష్ట బందోబస్తు, ప్రశ్నాపత్రాలు విమానాల్లో తరలింపు

దేశవ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్.. సెంటర్లలో పటిష్ట బందోబస్తు,  ప్రశ్నాపత్రాలు విమానాల్లో తరలింపు
Advertisement

Delhi: దేశవ్యాప్తంగా నీట్ యూజీ-2026 రీ ఎగ్జామ్ నేడు జరగనుంది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఈసారి పేపర్ లీక్ ఎలాంటి అవకాశం లేకుండా గట్టి చర్యలు చేపట్టింది ఎన్టీఏ. నీట్ ప్రశ్నాపత్రాలను ఆయా సెంటర్లకు విమానాల ద్వారా తరలిస్తున్నారు. నీట్ పరీక్ష మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది.

దేశవ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్.. సెంటర్లలో పటిష్ట బందోబస్తు

Advertisement

దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ యూజీ- 2026 రీ ఎగ్జామ్‌కు ప్రారంభం కానుంది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. అందుకోసం సుమారం 5454 సెంటర్లను ఏర్పాటు చేసింది ఎన్టీఏ. దేశంలో 551 నగరాల్లోని 5,440 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. విదేశాల్లోని 14 కేంద్రాల్లో ఎగ్జామ్ జరగనుంది. ఇంగ్లీష్‌తోపాటు 12 భారతీయ భాషలలో ఈ పరీక్ష జరగనుంది.

నీట్ పరీక్షా కేంద్రం గేటు 11 గంటలకు ఓపెన్ కానుంది. అభ్యర్థులు మధ్యాహ్నం 1.15 గంటలకు పరీక్షా కేంద్రానికి హాజరుకావాలి. నీట్ పరీక్షకు చివరి రిపోర్టింగ్ సమయం మధ్యాహ్నం 1.30 నుండి 1.45 వరకు ఉంటుంది. ఆ సమయంలోపు పరీక్షా కేంద్రం గేట్లు క్లోజ్ కానున్నాయి. ఇక పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.15 గంటల వరకు జరగనుంది.

Advertisement

విమానాల్లో ప్రశ్నాపత్రాలు తరలింపు.. సెంటర్లలోకి వాటికి నిషేధం

విద్యార్థుల ధృవీకరణ కోసం ప్రత్యేకంగా 15 నిమిషాల అదనపు సమయం కేటాయించింది.  పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నీట్ యూజీ రీ-టెస్ట్ అడ్మిట్ కార్డు ప్రింటెడ్ కాపీని వెంట తీసుకువెళ్లాలి. దానిపై ఉన్న అన్ని వివరాలు, ఫోటోగ్రాఫ్, బార్‌కోడ్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి. విద్యార్థులు చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు, దరఖాస్తు ఫారంలోని ఫోటోను పోలిన పాస్‌పోర్ట్ ఫోటో తీసుకెళ్లాలి.

ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి, స్కూల్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా ఉంటే సరిపోతుంది. మొత్తం 95 వేల పరీక్ష జరగనున్న గదుల్లో సీసీటీవీ అమర్చారు. దాదాపు 1,38,560 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జాతీయ-రాష్ట్ర మంత్రిత్వ శాఖల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈసారి పరీక్ష జరుగుతోంది.

ALSO READ: పాలిటెక్నిక్ విద్యార్థులకు అలర్ట్.. ఏపీ పాలీసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

సీసీటీవీ ఫీడ్‌ల ఏఐ-ఆధారిత విశ్లేషణ 51,311 జామ్మర్‌లు మోహరించారు. ప్రతి గదిలో ఇద్దరు ఇన్విజిలేటర్లు, ప్రతి కేంద్రంలో 10కు పైగా అధికారులు ఉండనున్నారు. 38,795 ఫ్రిస్కింగ్ సిబ్బంది 48,448 బయోమెట్రిక్ సిబ్బంది ఉన్నారు. 6,700 అబ్జర్వర్లు, 100కు పైగా వర్చువల్ అబ్జర్వర్లు ఉండనున్నారు.

సగటున ప్రతి కేంద్రంలో 40 నుంచి 50 మంది భద్రతా సిబ్బంది ఉండనున్నారు. పోలీసులు, పారామిలిటరీ, భారత వైమానిక దళం, తపాలా శాఖను సమీకరించారు. మొత్తానికి ఈ సారి నీట్ పరీక్ష విద్యార్థులతోపాటు అధికారులు, ప్రభుత్వానికి ఒక పరీక్షగా మారింది.  స్మార్ట్‌ఫోన్‌లు, బ్లూటూత్, ఇయర్‌ఫోన్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రం లోపల ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. ఒకవేళ ఆ తరహా వస్తువులు ఏమైనా తీసుకొస్తే విద్యార్థి తన సొంత పూచీతో పరీక్షా కేంద్రం వెలుపల భద్రపరచాలి.

Related News

పాలిటెక్నిక్ విద్యార్థులకు అలర్ట్.. ఏపీ పాలీసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే ఛాన్స్

గుడ్ న్యూస్.. 86 లెక్చరర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్

ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్.. 1,500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు.. 78 వేల మంది ఉత్తీర్ణత

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు లైన్‌ క్లియర్‌.. సుప్రీంకోర్టు నిరాకరణ, జూన్‌ 21న పరీక్ష యథాతథం

ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు.. ఫస్టియర్ విద్యార్థులదే హవా

Big Stories

×