APMSRB Recruitment 2026: ఏపీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే అభ్యర్థులకు, ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్నవారికి ఒక అద్భుతమైన అవకాశం. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ , నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన 529 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ లాంటి ఖాళీలు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఈ ఎంపికలు జరగడం విశేషం.
ఏపీ వైద్య శాఖలో 529 ఉద్యోగాలు
మెడికల్ రంగంలో కెరీర్ సెట్ చేసుకోవాలనుకునే ఏపీ అభ్యర్థులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్. APMSRB నోటిఫికేషన్ నెం. 10/2026 ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న స్థానిక అభ్యర్థులు జూన్ 30, లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
మొత్తం 529 ఖాళీలు ఉండగా, వాటి వివరాలు..
స్టాఫ్ నర్స్ : 419 పోస్టులు
ఫార్మసిస్ట్ : 24 పోస్టులు
మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ : 86 పోస్టులు
కావలసిన అర్హతలు:
స్టాఫ్ నర్స్: బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎమ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఏపీ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
ఫార్మసిస్ట్: డి.ఫార్మా లేదా బి.ఫార్మా కోర్సు చేసి ఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్: ఇంటర్‌తో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఒకటిన్నర సంవత్సరాల సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి.
వయోపరిమితి, పీజు:
అభ్యర్థుల వయస్సు 01 జనవరి 2026 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు రూ. 1,200 కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 900 గా నిర్ణయించారు. దీనిని ఆన్‌లైన్ గేట్‌వే ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ,జీతం:
దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. మొత్తం 100 మార్కులకు గానూ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇందులో మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మార్కులకు 75 మార్కులు, కోర్సు పాసైనప్పటి నుండి ఉన్న సీనియారిటీకి గరిష్టంగా 10 మార్కులు, అలాగే గతంలో ప్రభుత్వ ఆసుపత్రులు/ఎన్‌హెచ్‌ఎమ్ లో కాంట్రాక్ట్ సర్వీస్ చేసిన వారికి గరిష్టంగా 15 మార్కుల వెయిటేజీ ఇస్తారు.
ఎంపికైన స్టాఫ్ నర్సులకు నెలకు రూ. 27,675, ఫార్మసిస్ట్‌లకు రూ.23,393 మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్లకు రూ. 23,494 చొప్పున ఫిక్స్‌డ్ వేతనం లభిస్తుంది.
ఎలా అప్లై చేయాలి?
అర్హులైన అభ్యర్థులు APMSRB అఫీషియల్ వెబ్‌సైట్ లోకి వెళ్లి ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మీ సర్టిఫికేట్లను పిడిఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించిన తర్వాత ఫైనల్ అప్లికేషన్ నంబర్‌ను సేవ్ చేసుకోండి.