
PNB : పంజాబ్ నేషనల్ బ్యాంకులో వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 240 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, బీఆర్క్, సీఏ, సీఎంఏ, ఐడీడబ్ల్యూఏ, ఎంఈ, ఎంటెక్, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎంలోని ఏదైనా ఒక విభాగంలో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థుల వయస్సు 21-38 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్షలో రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి మొత్తం 200 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాల సమయం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. దరఖాస్తు ఫీజు రూ. వెయ్యిగా నిర్ణయించారు.
పోస్టుల వివరాలు..
ఆఫీసర్- క్రెడిట్ : 200
ఆఫీసర్- ఇండస్ ట్రీ : 08
ఆఫీసర్- సివిల్ ఇంజినీర్ : 05
ఆఫీసర్- ఎలక్ట్రికల్ ఇంజినీర్ : 04
ఆఫీసర్- ఆర్కిటెక్ట్ : 01
ఆఫీసర్- ఎకనామిక్స్ : 06
మేనేజర్- ఎకనామిక్స్ : 04
మేనేజర్-డేటా సైంటిస్ట్ : 03
సీనియర్ మేనేజర్- డేటా సైంటిస్ట్ : 02
మేనేజర్-సైబర్ సెక్యూరిటీ : 04
సీనియర్ మేనేజర్- సైబర్ సెక్యూరిటీ : 03
ఆన్‌లైన్ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 11-06-2023
వెబ్‌సైట్: https://www.pnbindia.in/Recruitments.aspx