RRC NWR: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. ఆర్ఆర్‌సీ నార్త్ వెస్టర్న్ రైల్వే లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, వయస్సు, దరఖాస్తు విధానం, అప్లికేషన్ ఫీజు తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నోట్: రేపే లాస్ట్ డేట్
ఆర్ఆర్‌సీ నార్త్ వెస్టర్న్ రైల్వే లో 2162 అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. నవంబర్ 2న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 2162
ఆర్ఆర్‌సీ నార్త్ వెస్టర్న్ రైల్వేలో అప్రెంస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
అప్లికేషన్ ఫీజు: రూ.100 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 3
దరఖాస్తుకు చివరి తేది: 225 నవంబర్ 2
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: ఐటీఐ పాసై ఉండాలి.
నార్త వెస్టర్న్ రైల్వేలో ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, పైప్ ఫిట్టర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, పవర్ ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, తదితర పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://rrcjaipur.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. అప్రెంటీస్ అవకాశం వచ్చినప్పుడే అప్లై చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. అప్రెంటీస్ పోస్టుకు సెలెక్ట్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 2162
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 2