Big Stories

Precautions for Kidney Cleanse : ఇలా చేస్తే మీ కిడ్నీలు సేఫ్‌


Precautions for Kidney Cleanse : మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. ఇవి ఎప్పుడూ పనిచేస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది. మన బాడీలోని విష, వ్యర్థ పదార్థాలను బయటికి పంపే పని కిడ్నీలదే. అలా వ్యర్థాలను బయటికి పంపకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉంది. నిత్యం మనం తినే ఆహారం, నీళ్లు, అలవాట్లు కిడ్నీలపై అనేక ప్రభావాన్ని చూపుతాయి. మూత్రపిండాలు ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా చాలా చేస్తుంటారు. జాగ్రత్తలు తీసుకోకుంటే మూత్ర పిండాల్లో రాళ్లు రావడం, అనేక సమస్యలు తలెత్తుతాయి. చివరికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వరకు వెళ్తుంది. కాబట్టి చేయకూడని, చేయాల్సిన పనులు తెలుసుకుని కిడ్నీలను కాపాడుకోండి.

- Advertisement -

మద్యపానం :
ప్రతి అవయవాన్ని పాడుచేసే అలవాటు ఇది. మూత్రపిండాలపై కూడా మద్యపానం ఎఫెక్ట్‌ ఉంటుంది. కిడ్నీల పనితీరు మార్చడంతో పాటు వాటిపై తీవ్ర ఒత్తిడి కలుగజేస్తుంది. అందుకే మద్యపానం అలవాటు ఉన్నవారు ఒక్కసారిగా ఆపలేకపోయినా కనీసం మోతాదు అయినా తగ్గిస్తే మంచిది.

- Advertisement -

ఉప్పు:
ఉప్పు హైబీపీకి కారణం అవడమే కాదు. మూత్రపిండాలను కూడా పాడు చేస్తుంది. ఉప్పును ఎంత తగ్గిస్తే శరీరానికి అంత మంచిది. ఒక రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు శరీరంలో కుండకూడదు.

తీపి :
చాలా మంది తీపి తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. డయాబెటిస్‌ లేనివాళ్లు రోజుకు ఒక స్వీట్‌ తినవచ్చు. అంతకంటే ఎక్కువ తింటే చాలా సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. చక్కెర కలిపిన పదార్థాలు తినడం వల్ల కిడ్నీలలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది.

మూత్రం ఆపుకోవడం
చాలా మంది యూరిన్ వస్తే వెంటనే వెళ్లకుండా ఆపుకుంటారు. ఇలా ఎక్కువ సార్లు చేస్తే ఎంతో ప్రమాదం. మూత్రం ఆపుకోవడంతో కిడ్నీలో రాళ్లు చేరే అవకాశం ఉంది.

ప్రోటీన్స్ :
పోషకాలు ఉండే ఫుడ్‌ తినడం ఎంతో అవసరం. అయితే మోతాదు కంటే ఎక్కువగా తింటే కూడా కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. రోజుకు రెండు గుడ్లు తినవచ్చు, కానీ కొందరు అంతకంటే ఎక్కువ తింటుంటారు. గుడ్లలో ఎక్కువ ప్రొటీన్లు ఉండటం వల్ల కిడ్నీలపై అధిక ఒత్తిడి పడుతుంది.

నిద్ర :
మన దేహానికి సరిపడ నిద్రలేకపోయినా కిడ్నీలు సరిగా పనిచేయవు. అందుకే 7 నుంచి 8 గంటలకు తగ్గకుండా పడుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

నీరు :
నీళ్లు తక్కువ తాగడంతో శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. కిడ్నీల పనితీరు మందగిస్తుంది. రోజుకు 7 గ్లాసుల నీళ్లు తాగితే కిడ్నీలు బాగా మెరుగ్గా పనిచేస్తాయి.

కిడ్నీల ఆరోగ్యం కోసం విటమిన్ ఎ, విటమిన్ బి6, మెగ్నీషియంలాంటి పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను ప్రతిరోజు తినాలి. మూత్రపిండాలు చెడిపోయి ఎంతో మంది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అనారోగ్యం, ఆర్ధికంగా చితికిపోతున్నారు. అందుకే మీ కిడ్నీల ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News