E-Paper
Advertisement

Akkineni Nagarjuna : కూలీ సినిమా 100 బాషా లతో సమానం

Akkineni Nagarjuna : కూలీ సినిమా 100 బాషా లతో సమానం
Advertisement

Akkineni Nagarjuna : కేవలం తెలుగు ప్రాక్షకులు మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా కూలీ. లియో సినిమా తర్వాత లోకేష్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ముఖ్యంగా రజనీకాంత్ తో పాటు మిగతా ఇండస్ట్రీకి చెందిన చాలామంది స్టార్ హీరోలు ఈ సినిమాలో కనిపిస్తున్నారు. అందుకే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు కూడా విపరీతమైన హైప్ సినిమాపై క్రియేట్ చేశాయి. ముఖ్యంగా యువసామ్రాట్ నాగర్జున ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. మొదటిసారి ఇటువంటి పాత్రను నాగర్జున పోషిస్తున్నారు. అయితే దీనికోసం నాగార్జునను చాలాసార్లు ఒప్పించే ప్రయత్నం చేశాడు లోకేష్. మొత్తానికి అది వర్కౌట్ అయింది. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమైన తరుణంలో తమిళ్లో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నాగార్జున కూడా హాజరై తన మాటలతో విపరీతంగా ఆకట్టుకున్నారు.

Advertisement

కూలీ కి భారీ ఎలివేషన్ 

మీ అందరికీ బాషా సినిమా గుర్తుందా.? ఈ కూలి సినిమా 100 బాషా సినిమాలతో సమానం. రజినీకాంత్ ఒరిజినల్ సూపర్ స్టార్. భారతీయ సినిమాకు అతనొక పిల్లర్. ఈ సినిమాలో నన్ను చూడరు సైమన్ అనే పాత్రను చూస్తారు. ఇప్పటివరకు నేను పనిచేసిన దర్శకులలో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. నువ్వు నాకు నెగిటివ్ రోల్ ఇచ్చినా కూడా, సినిమా మొత్తం ఒక పాజిటివ్ ఫీల్. అనిరుద్ ఒక హిట్ పాట తరువాత ఇంకో హిట్ పాట ఇస్తూనే ఉంటాడు. అనిరుద్ వర్క్ అమేజింగ్. ఈ సినిమాకు పని చేసిన అందరి టెక్నీషియన్స్ కి థాంక్యూ. నేను ఎప్పుడూ చెన్నైకి వచ్చినా కూడా సొంత ఇంటికి వచ్చినట్లు ఉంటుంది. కూలీ సినిమా నాకు చాలా స్పెషల్.

Advertisement

రజనీకాంత్ సింప్లిసిటీ 

17 రోజులు థాయిలాండ్లో రాత్రులు షూట్ చేశాం. లోకేష్ కనకరాజ్ పొద్దున్నే 6:00 వరకు షూటింగ్ చేసేవాడు. ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత రజనీకాంత్ గారు అందరిని పిలిచి తిరిగి ఇంటికి వెళుతున్నప్పుడు ఏమైనా తీసుకెళ్లండి అని అందరికీ కవర్లో పెట్టి డబ్బులు ఇచ్చారు. నన్ను అది బాగా కదిలించింది నేను కూడా అది ఫాలో అవుతాను. అంటూ మాట్లాడారు నాగార్జున. ఒక కూలీ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసిన నటించిన వార్ 2 సినిమా కూడా అదే రోజున విడుదల కానుంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

Also Read: SSMB 29 : బాబు లుక్ అదిరింది, మహేష్ బాబు ఫ్యాన్స్ లో జోష్ నింపిన కార్తికేయ

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×