SSMB 29 : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. చాలా చిన్న ఏజ్ లోని ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు. మహేష్ బాబు క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు మహేష్ బాబు కేవలం తెలుగు సినిమాలు మాత్రమే చేశాడు. కానీ మహేష్ బాబు చూడ్డానికి మాత్రం హాలీవుడ్ హీరోలా ఉంటాడు. గతంలో పలు సందర్భాల్లో ఇదే ప్రశ్న అడిగినప్పుడు మహేష్ సెటైరికల్ గా మాట్లాడారు.
ఇక తన కెరీర్లో మొదటిసారి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కేవలం తెలుగుకి మాత్రమే పరిమితమైన క్రేజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలియనుంది. ఈ సినిమా మీద విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. ఎస్.ఎస్ రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. అయితే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే మొత్తానికి అప్డేట్ నవంబర్లో ఇస్తామని టీం కూడా క్లారిటీ ఇచ్చేసింది.
మహేష్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చాలామంది అభిమానులు తనకు విషెస్ తెలియజేశారు. అయితే ఆ విషెస్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా గమనించారు అంటూ, లాప్టాప్ లో సింహాన్ని చూస్తున్న మహేష్ బాబు ఫోటో ఒకటి ట్విట్టర్లో అప్లోడ్ చేశాడు రాజమౌళి తనయుడు కార్తికేయ. ఈ ఫోటోలో మాత్రం మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నారు. లాంగ్ హెయిర్ తో క్యాప్ పెట్టుకొని కనిపిస్తున్నారు. సింహాన్ని చూస్తుండడంతో చాలామంది కామెంట్స్ లో నిన్ను నువ్వే చూసుకుంటున్నావా అన్న అంటున్నారు. మొత్తానికి ఫస్ట్ లుక్ రిలీజ్ కాకపోయినా కూడా మహేష్ ని ఇలా చూస్తుంటే ఇది చాలు అంటూ కార్తికేయ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.
రెండేళ్లు గ్యారెంటీ
రాజమౌళిని జక్కన్న అని ఎందుకంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విషయంలో అసలు కాంప్రమైజ్ కాడు. అనుకున్నది పర్ఫెక్ట్ గా వచ్చేవరకు కష్టపడుతూనే ఉంటారు. ఈ లెక్కన మహేష్ బాబు తో సినిమా ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు. ఈ సినిమా మినిమం రెండేళ్ల తర్వాతే విడుదలకు సిద్ధమవుతుంది. కేవలం తెలుగు మాత్రమే పరిమితమైన మహేష్ బాబు క్రేజ్ ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలియనుంది.
Our #GlobeTrotter witnessed love pouring in from every corner of the globe… cheers to whoever came up with the cool idea of https://t.co/QzEKjVn3um ❤️❤️
Just felt like sharing this with you all… pic.twitter.com/2e4bHpIux4
— S S Karthikeya (@ssk1122) August 11, 2025