Heavy rain: గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరంలో అయిత వర్షాలు దంచికొడుతున్నాయి. సాయంత్రం, రాత్రివేళల్లో ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. ఈ వర్షాలకు నగరవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు అయితే ట్రాఫిక్ లో చిక్కుకుని గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. అందుకే వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు భాగ్యనగర వాసులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను అప్డేట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చింది.
మరో గంట సేపట్లో భాగ్యనగరంలో దంచుడే..
మరో గంట సమయంలో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్ ఏరియాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వానలు కురుస్తాయని వివరించింది.
ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
రానున్న 2 గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సిద్దిపేట, జనగాం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పారు. సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయిని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు పడే ఛాన్స్ కూడా ఉందని అధికారులు హెచ్చరించారు.
ALSO READ: Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?
బయటకు రావొద్దు.. పిడుగులు పడుతున్నాయి..
లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కరెంట్ వైరులను, స్థంబాలన తాక వద్దని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే