5 Balls Won Match: క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదయింది. కేవలం ఐదు బంతుల్లోనే మ్యాచ్ ముగిసిపోయింది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అండర్ 19 వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫైయర్ 2025 టోర్నమెంట్ లో ఈ సంఘటన జరిగింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా కెనడా వర్సెస్ అర్జెంటీనా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కేవలం 5 బంతులలోనే ముగిసింది.
Also Read: Mohamed Siraj : సేమ్ టు సేమ్ డిట్టు దించేశారు… మహమ్మద్ సిరాజ్ కూడా కుళ్ళుకోవాల్సిందే
5 బంతుల్లోనే ముగిసిన మ్యాచ్
అమెరికా స్ క్వాలిఫైయర్ 2025 టోర్నమెంట్ లో భాగంగా తాజాగా కెనడా వర్సెస్ అర్జెంటీనా మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ కేవలం 5 బంతుల్లోనే ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన అర్జెంటీనా జట్టు 19 ఓవర్లు ఆడి… కేవలం 23 పరుగులే చేసింది. ఆ 23 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది అర్జెంటీనా. ఇందులో ఏడుగురు బ్యాట్స్మెన్లు డక్ అవుట్ అయ్యారు. కెనడా బౌలర్.. జగమన్ దీప్ పాల్ 5 ఓవర్లు వేసి ఏకంగా ఆరు వికెట్లు తీశాడు. అంతేకాదు 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన కెనడా జట్టు ఆ లక్ష్యాన్ని అవలీలగా చేధించింది. కేవలం 5 బంతులలోనే టార్గెట్ రీచ్ అయింది కెనడా టీం. ఇందులో కెప్టెన్ యువరాజ్ రెండు బౌండరీలు అలాగే రెండు సిక్సర్లు కొట్టేశాడు. ఈ నేపథ్యంలోనే ఐదు బంతుల్లో 24 పరుగులు బాదేసి కెనడా విజయం సాధించింది.
Also Read: Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని
ఐసీసీ అండర్ 19 పురుషుల వరల్డ్ కప్ అమెరికాస్ క్వాలిఫైయర్ 2025 టోర్నమెంట్ లో ( ICC U19 Men’s Cricket World Cup Americas Qualifier, 2025 ) అర్జెంటీ నా అండర్ 19 టీం కి మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే 19.4 ఓవర్లు ఆడిన అర్జెంటీనా అండర్ 19 టీం… కేవలం 23 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఓపెనర్ సోరొండో 7 పరుగులు చేయగా ఇందులో ఒక సిక్సర్ కూడా ఉంది. ఇక ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు.
మొత్తం ఏడుగురు డక్ అవుట్ కావడం గమనార్హం. అటు కెనడా బౌలర్ల లో… బెనివాల్ 5 ఓవర్లు వేసి ఐదు పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. డాని స్టార్ రెండు వికెట్లు తీయగా పాల్ ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. మిశ్రా రెండు వికెట్లు తీసి దుమ్ము లేపాడు. ఇక అనంతరం బ్యాటింగ్కు దిగిన కెనడా అండర్ 19 జట్టు… కేవలం 5 బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్ చేసింది. ఓపెనర్ యువరాజ్ సామ్రా నాలుగు బంతులు 20 పరుగులు చేశాడు. పటేల్ ఒక్క పరుగు చేశాడు. ఇక ఈ మ్యాచ్ విజయం అనంతరం… క్రికెట్ అభిమానులు.. రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఐదు బంతుల్లో మ్యాచ్ ఫినిష్ కావడం ఏంటని షాక్ అవుతున్నారు.