Bus accident: విశాఖ బస్టాండ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే కళ్ల ముందు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు అదుపు తప్పి ఫ్లాట్ ఫామ్ పైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రయాణికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఒకరు మృతి.. పలువురికి గాయాలు…
విశాఖ బస్టాండులో చాలా మంది ప్రయాణికులు బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్టీసీ కాంప్లెక్ ఓ బస్సు అతి వేగంగా వచ్చి.. అదుపు తప్పడంతో క్షణాల్లో ప్రమాదం జరిగింది. అక్కడ చాలా మంది ప్రయాణికులు ఉండడంతో వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా స్పాట్ లోనే చనిపోయింది. మరి కొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన మహిళా వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ: Kukatpally News: ఎంత పని చేశావ్ దేవుడా..? షటిల్ ఆడుతుండగా కరెంట్ షాక్.. క్షణాల్లో బాలుడు మృతి
భయాందోళనకు గురైన ప్రయాణికులు
బస్స బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే క్షణాల్లోనే మహిళ ప్రాణం పోవడం, పలువురికి తీవ్రగాయాలు కావడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
డ్రైవర్‌కు అవగాహన లేకపోవడం వల్లే..
విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లాల్సిన బస్సు ప్రమాదం జరగడం దురదృష్టకరం అని విశాఖ ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు అన్నారు. డ్రైవర్ కు కొంచెం అవగాహన లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు. బస్సు వచ్చే సమయంలో వేగంగా వెళుతున్నట్లు ఎక్కడా కనిపించలేదని అన్నారు. ప్లాట్ ఫామ్ కి వచ్చే ప్రతి బస్సుకు ముందస్తు సూచనలు చేస్తామని పేర్కొన్నారు. ప్రమాదంలో ఓ మహిళా ప్రయాణికురాలు మృతి చెందడంతో పాటు మరి కొంత మందికి తీవ్రగాయాలు అయ్యాయని ఆర్ఎం అప్పనాయుడు చెప్పారు.