E-Paper
Advertisement

BIG TV Telangana Election Survey : బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే?

BIG TV Telangana Election Survey : బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే?
Advertisement
BIG TV Telangana Election Survey

BIG TV Telangana Election Survey(Telugu Breaking News) :

తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా? లేదంటే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రానుందా? మరి బీజేపీ ప్రభావం తెలంగాణలో ఏ మేరకు ఉండనుంది? మరి తెలంగాణలో వాస్తవ పరిస్థితులు ఏంటి? పార్టీలు, అభ్యర్థుల పట్ల ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది. రెండు సార్లు అధికారంలో ఉన్న గులాబీ గవర్నమెంట్‌పై వ్యతిరేకత ఎంత? బీఆర్‌ఎస్-బీజేపీ మధ్య బీ టీమ్ ఆరోపణలు ఏ మేరకు ప్రభావం చూపనున్నాయి? ఇలా బిగ్ టీవీ తెలంగాణలోని ప్రతీ నియోజవర్గంలో ఎక్స్‌క్లూజివ్‌ సర్వే చేసింది. ప్రతీ నియోజకవర్గం నుంచి 600 శాంపిల్స్‌కు తగ్గకుండా ఓటర్ల అభిప్రాయాలు సేకరించింది. ప్రతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో సర్వే చేసింది.

ఆదిలాబాద్‌ ఎస్టీ రిజర్వ్‌డ్‌ లోక్‌సభ స్థానం పరిధిలో BRSకు 1 నుంచి 2 స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 3 నుంచి 4 చోట్ల విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక BJP విషయానికి వస్తే 0 నుంచి 1 స్థానంలో గెలిచే చాన్సెస్‌ ఉన్నాయి. BSP గెలుపు అవకాశాలు గమనిస్తే.. ఆ పార్టీకి 0 నుంచి 1 స్థానంలో విజయం సాధించ వచ్చని బిగ్‌ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా తేలింది.

Advertisement

పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అధికార పార్టీకి 2 నుంచి 3 స్థానాలు, ప్రధాన ప్రతిపక్షానికి 4 నుంచి 5 స్థానాల్లో విజయావకాశాలు కనిపిస్తున్నాయి. కమలం పార్టీతో పాటు ఇతర పార్టీలకు పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు లేవని బిగ్‌ టీవీ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైంది. కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలో.. గులాబీ పార్టీకి 3 నుంచి 4 స్థానాలు.. హస్తం పార్టీకి 2 నుంచి 3 సీట్లు.. కాషాయ దళానికి 0 నుంచి 1 చోట గెలిచే అవకాశాలు ఉన్నాయి

నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో.. బీఆర్ఎస్‌ పార్టీకి 5 నుంచి 6 స్థానాలు.. కాంగ్రెస్‌కు 1 నుంచి 2 చోట్ల గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో.. BRSకు 1 నుంచి 2 స్థానాలు… కాంగ్రెస్‌ పార్టీకి 5 నుంచి 6 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మెదక్ పరిధిలో…గులాబీ పార్టీకి 5 నుంచి 6 స్థానాలు.. కాంగ్రెస్‌ పార్టీ 2 నుంచి 3 స్థానాల్లో విజయం సాధించనుంది.

Advertisement

మల్కాజ్‌గిరి లోక్‌సభలో పరిధిలో.. BRSకు 3 నుంచి 4 స్థానాలు.. కాంగ్రెస్‌ పార్టీకి 3 నుంచి 4 స్థానాలు.. దాదాపు సమానస్థాయిలో సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో.. గులాబీ పార్టీకి 3 నుంచి 4 స్థానాలు..హస్తం పార్టీకి 2 నుంచి 3 స్థానాలు దక్కొచ్చని బిగ్‌ టీవీ ఎలక్షన్‌ సర్వేలో తేలింది. హైదరాబాద్‌ పరిధిలో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో.. కారు పార్టీకి… ఒక్క సీటు కూడా వచ్చే అవకాశాలు లేవు. ప్రధాన ప్రతిపక్షానికి కూడా 0 నుంచి 1 .. బీజేపీకి 0 నుంచి 1.. మజ్లిస్‌కు 5 నుంచి 7 స్థానాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో.. BRSకు నుంచి 5.. కాంగ్రెస్‌ పార్టీకి 2 నుంచి 4 సీట్లు దక్కే చాన్సెస్‌ ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ పరిధిలో.. అధికార పక్షానికి 3 నుంచి 4.. ప్రధాన ప్రతిపక్షానికి 3 నుంచి 4.. బీజేపీకి 0-1 స్థానంలో విజయావకాశాలు కనిపిస్తున్నాయి. నాగర్‌కర్నూల్‌ ఎస్సీ రిజర్వ్డ్‌ ఎంపీ స్థానంలో… BRSకు 2 నుంచి 4 స్థానాలు.. కాంగ్రెస్‌ పార్టీకి 3 నుంచి 4 చోట్ల, బీజేపీ 0 నుంచి 1 చోట గెలవనుంది.

నల్గొండ లోక్‌సభ పరిధిలో.. BRSకు 1 నుంచి 2 స్థానాలు.. కాంగ్రెస్‌ పార్టీకి 6 నుంచి 7 స్థానాలు రానున్నాయి. భువనగిరి పార్లమెంట్‌ పరిధిలో.. గులాబీ పార్టీకి 2 నుంచి 3.. హస్తం పార్టీకి 4 నుంచి 5 చోట్ల, బీజేపీకి 0 నుంచి 1 చోట గెలిచే చాన్సెస్‌ కనిపిస్తున్నాయి.

వరంగల్‌ పరిధిలో.. BRSకి 2 నుంచి 3 స్థానాలు.. హస్తం పార్టీకి 4 నుంచి 5 సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహబూబాబాద్‌ పరిధిలో.. BRSకు 0 నుంచి 1 చోట.. బీజేపీ 0-1, కాంగ్రెస్‌ పార్టీకి 6 నుంచి 7 స్థానాలు గెలిచే చాన్సెస్‌ ఉన్నాయని బిగ్‌ టీవీ ఎలక్షన్‌ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా వెల్లడైంది. ఖమ్మం లోక్‌సభ పరిధిలో.. గులాబీ పార్టీ 0 నుంచి 1 సీటు.. హస్తం పార్టీ 6 నుంచి 7 చోట్ల గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×