E-Paper
Advertisement

Aliens in America : అమెరికాలో గ్రహాంతరవాసులు..? నాసా ఏం చెప్పిందంటే..?

Aliens in America : అమెరికాలో గ్రహాంతరవాసులు..? నాసా ఏం చెప్పిందంటే..?
Advertisement
Aliens in America

Aliens in America : గ్రహాంతరవాసులు ఉన్నాయా? లేవా?.. ఈ మిస్టరీ ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు. కానీ ఉన్నాయేమో అనిపించే విధంగా పలు సంఘటనలు అయితే జరిగాయి. ఈ సంఘటనలు ఆధారంగా తీసుకొని గ్రహాంతరవాసులు ఉన్నాయని నిర్ధారించడం కూడా కరెక్ట్ కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అన్ని దేశాల కంటే ఎక్కువగా గ్రహాంతవాసులపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది అమెరికా. తాజాగా లాస్ వేగస్‌లో గ్రహాంతరవాసులు కనిపించాయి అంటూ స్థానికులు చెప్పడం వైరల్‌గా మారింది.

Advertisement

లాస్ వేగస్‌లోని కాంటెన్నియల్ హిల్స్ దగ్గర ఆకాశం నుండి ఒక ప్రకాశంతమైన వెలుగు నేలకు తాకింది. తాజాగా ఒక ఉదయం వేళ ఈ వెలుగును అక్కడి స్థానికులు చూశారు. దీంతో గ్రహాంతరవాసులు భూమి మీదకు ఎంటర్ అయ్యారు అంటూ వారు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆ ఏరియాలో డ్యూటీ చేస్తున్న ఒక ఆఫీసర్ బాడీ కెమెరాలో ఈ లైట్ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఆపై కొన్నిరోజులకు ఈ విజువల్స్‌ను మెట్రోపోలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

39 సెకండ్లు ఉన్న ఈ వీడియో క్లిప్.. అతి కొద్ది సమయంలోనే 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించింది. ఈ లైట్ కనిపించినప్పుడు ఆ ఏరియాలో నివసించే ఒక వ్యక్తి.. అక్కడ విచిత్రమైన సంఘటన ఏదో జరుగుతుంది అంటూ చెప్తున్న కాల్ రికార్డింగ్ కూడా పోలీసులు బయటపెట్టారు. పోలీసులు అక్కడకు చేరుకొని ఏం లేదు అని అప్పటికే నిర్ధారించారు. కానీ ఇప్పటివరకు ఆ లైట్.. గ్రహాంతరవాసుల నుండే వచ్చిందని చాలామంది బలంగా నమ్ముతుండగా.. అది భూమిని తాకిన ఒక మెటియొర్ అని నాసా ప్రకటించింది.

Advertisement

ఇప్పటికీ చాలామంది స్థానికులు ఆ లైట్ వెలుగులో ఒక పెద్ద ఆకారం కనిపించింది అంటూ లాస్ వేగస్ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో చెప్తున్నారు. ఒకేసారి అంత వెలుగు రావడం స్థానికులను మాత్రమే కాకుండా పోలీసులను కూడా ఆందోళనకు గురిచేసింది. నాసా ముందస్తుగా ఈ మెటియోర్‌ను గుర్తించలేకపోయిందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఇప్పటికీ కొంతమంది స్థానికులు మాత్రమే కాదు.. సంఘటన సమయంలో అక్కడికి వెళ్లిన పోలీసులు కూడా ఇది మెటియోర్ అని పూర్తిగా నమ్మలేకపోతున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని గురించిన నిజం జ్యోత్స్న సూరజ్ కు చెప్తుందా..?            

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Big Stories

Advertisement
×